Saturday, May 11, 2024
- Advertisement -

నేను, అఖిల్ ప్రేమగానే ఉన్నాం

- Advertisement -

తెలుగు ఇండ‌స్ట్రీలో ఇప్పుడు ఎక్క‌డ విన్న ఎంసీఏ, హలో సినిమాలు గురించే.ఎందుకంటే ఇద్ద‌రు మంచి ఫేమ‌స్ హీరోలు కావ‌డం దీనికి కార‌ణం.నాని ఎంసీఏతో వ‌స్తుంటే హలో తో అక్కినేని వార‌సుడు అఖిల్ వ‌స్తున్నాడు.రిలీజ్ డేట్స్ విషయంలో ఈ రెండు సినిమాల నిర్మాతలు మధ్య చిన్నచిన్న అభిప్రాయ బేధాలు వచ్చిన మాట కూడా వాస్తవం.నాగార్జున, దిల్ రాజు ఆడియన్స్ కు ఎంత సర్దిచెప్పినా పోటీ మాత్రం తప్పలేదు. అయితే దీనిపై నాని మరోలా రియాక్ట్ అయ్యాడు.

నాకు, అఖిల్ కు మధ్య పోటీ లేదు. నాకు తెలిసి రెండు సినిమాలూ హిట్ అవుతాయి. ఇదే విషయంపై నేను అఖిల్ ఛాట్ చేసుకున్నాం. ప్రేమగా మెసేజ్ లు కూడా పెట్టుకున్నాం. మేమిద్దరం ప్రేమగానే ఉన్నాం. కొందరు మాత్రం లేనిపోని పోటీ సృష్టించారు. ఎంసీఏ, హలో సినిమాల మధ్య పోటీపై నాని వెర్షన్ ఇది. హలో సినిమా ట్రైలర్ చూసి వెంటనే అఖిల్ కు ఫోన్ చేసి మెచ్చుకున్నానని, ఎంసీఏ ట్రైలర్ కూడా బాగుందంటూ విక్రమ్ కుమార్, అఖిల్ తనకు కాల్స్ చేశారని నాని చెప్పుకొచ్చాడు. అసలు తమ మధ్య జరిగిన ఛాటింగ్ ను పబ్లిక్ లో పెడితే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఒక దశలో తనకు వచ్చిందంటున్నాడు నాని. చూద్దాం వ‌క‌వేళ హలో హిట్ అయితే నాని ఏవిధాంగా స్పంధిస్తాడో.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -