Monday, May 13, 2024
- Advertisement -

బ్యాట్ ప‌డుతున్న నాని..! మ‌రి బౌలింగ్ ఎవ‌రో?

- Advertisement -

నాని వ‌రుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు.నాని ప్ర‌స్తుతం నాగ‌ర్జున‌తో క‌లిసి ఓ మ‌ల్టీస్టార‌ర్‌లో మూవీలో న‌టిస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటుంది.ఈ సినిమా త‌రువాత నాని ఓ బ‌యోపిక్ మూవీలో న‌టిస్తున్నాడనే వార్తలు వినిపించాయి.అయితే నాని త‌న త‌రువాత సినిమా గురించి ట్విట్ట‌ర్‌లో ఓ పోస్ట‌ర్‌ని విడుద‌ల చేశారు.

ఈ పోస్టర్ ను బట్టి ఇది క్రికెట్ నేపథ్యంలో సాగే కథ అనీ .. నాని ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాకి ‘జెర్సీ’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందనున్న ఈ సినిమాకి గౌతమ్ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. నాని బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌కు యాంక‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -