Thursday, May 2, 2024
- Advertisement -

రైతుగా నాని సెట్ అవుతుడా..?

- Advertisement -

దేవ‌దాస్‌తో హిట్ కొట్టిన నాని త‌న త‌రువాత సినిమాల‌పై ఫోక‌స్ పెట్టాడు.ప్రస్తుతం నాని ‘జెర్సీ’ సినిమా చేస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే కథ ఇది. ఇందుకోసం నాని కొంతకాలంగా క్రికెట్ లో శిక్షణ తీసుకుంటున్నాడు. ఈ నెల 18వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ఇందుకు అవసరమైన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమా సెట్స్ పైకి వెళుతుండగానే మరో ప్రాజెక్టుకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా సమాచారం.

కిషోర్ అనే కొత్త ద‌ర్శ‌కుడు నానికి ఓ క‌థ వినిపించాడు.క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఓకే చెప్పాడ‌ట నాని.అయితే ఈ కథ పూర్తిగా గ్రామీణ వాతావరణంలో కొనసాగుతుంది. రైతు పాత్రలో నాని కనిపించనున్నాడని అంటున్నారు. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై ఈ సినిమా రూపొందనుంది.సినిమాకు సంబంధించిన పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌నున్నాయి.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -