- Advertisement -

సంక్రాంతి రేస్‌పై పద్ధతిగా స్పందించిన ఎన్టీఆర్

- Advertisement -

ఎన్టీఆర్ నటించిన  ‘నాన్నకు ప్రేమతో’ సినిమా సంక్రాంతికి రాబోతుంది. ఎన్టీఆర్ సరసన రకుల్ ప్రీతి సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఎన్టీఆర్ అభిమానులు కోరుకున్నట్టే నాన్నకు ప్రేమతో సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు.

ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ సంక్రాంతికి రిలీజ్ కాబోయే సినిమాల గురించి మాట్లాడారు. ఈ సంక్రాంతికి నాలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.

ఈ సంక్రాంతి ఎన్టీఆర్ చిత్రం ‘నాన్నకు ప్రేమతో ‘ , బాలయ్య ‘డిక్టేటర్’ , నాగార్జున ‘సోగ్గాడే చిన్ని నాయన’ , శర్వానంద్ నటించిన ‘ఎక్స్ ప్రెస్ రాజ’ చిత్రాలు బాక్స్ ఆఫీస్ బరిలో దిగుతున్నాయి. కానీ నాన్నకు ప్రేమతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్‌ సృష్టిస్తుందని అంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -