Monday, May 13, 2024
- Advertisement -

ఆ హీరో కథలు భాగుంటాయి.. కాని

- Advertisement -

టాలీవుడ్లో మనకు ఎక్కువగా లోటు కనిపించేది… కథల విషయంలోనే. హీరోలంతా ఎప్పుడూ కథలు కథలు అంటూ గోల చేస్తుంటారు. కాని వారెవరికీ కరెక్ట్ కథలు పడవు. కాని అదేంటో నారా వారబ్బాయి నారా రోహిత్ కు మాత్రం ఏక్ ధమ్ కథలు పడుతుంటాయి. మనోడి బాడీ లాంగ్వేజ్.. క్రేజ్ లేకపోవడంతో ఆయా కథలకు న్యాయం జరగకుండా పోతుంటుంది.

రౌఢీ ఫెలో ,అసుర లాంటి చిత్రాలు చూస్తే ఈవిషయం మనకు అర్ధమవుతుంది. ఇవనే కాదు ఇతను చేసిన చాలా సినిమాలు ఇలానే సైడై పోయాయి. తాజాగా ఆటగాళ్లు చిత్రం ఒకటి త్వరలో రాబోతోంది. ఫస్ట్ లుక్ చూశాక ఈసినిమా కూడా కథాపరంగానే భాగానే ఉంటుందనే ఫీలింగ్ నైతే ఇచ్చేశారు. ఈ మూవీలో జగపతి బాబుతో మంచి రోల్ చేయించినట్లు పోస్టర్ లో చూపించేశారు.

ఆటగాళ్లు . గేమ్ ఫర్ లైఫ్ అనే ట్యాగ్ లైన్‌తో తెరకెక్కుతోన్న ఈ సబ్జెక్ట్ లో జగపతిబాబు విలన్‌ పాత్ర వేయబోతున్నాడు. ఆంధ్రుడు సినిమాతో వచ్చిన పరుచూరి మురళి ఎంతో గ్యాప్ తర్వాత ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ నేడు ప్రారంభమైంది. సాయి కార్తీక్ మ్యూజిక్ అందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది అయితే ఈసినిమాతోననైనా కాస్త ఎనర్జటిక్ గా తయారై అలరిస్తే నారా రోహిత్ కు లైఫ్ ఉంటుంది. లేదంటే ఎప్పటిలాగానే.. రొటీన్ సినిమా అయిపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -