Saturday, May 4, 2024
- Advertisement -

చరణ్ సినిమాలో విలన్ గా నారా రోహిత్..?!

- Advertisement -

ఇప్పటి వరకూ హీరోగా నటిస్తూ.. తన ప్రతిభను నిరూపించుకుంటూ వస్తున్నాడు నారా రోహిత్. అయితే ఈ సోలో హీరోకి సరైన హిట్ దక్కలేదు.

దీంతో.. పూర్తి స్థాయి అట్రాక్టివ్ హీరోగా గుర్తింపు సంపాదించుకోలేకపోతున్నాడు. మరి ఈ హీరోకి సంబంధించి ఇప్పుడు ఆసక్తికరమైన అప్ డేట్ ఏమిటంటే.. ఇతడు విలన్ గా నటించడానికి సిద్ధం అవుతున్నాడనేది. అన్ని కుదిరితే రామ్ చరణ్ కు ఆపోజిట్ గా నటించబోతున్నాడు నారా రోహిత్. మెగా హీరోకు ఆపోజిట్ గా విలన్ గా కనిపించబోతున్నాడు ఈ యువ నటుడు.

ప్రస్తుతం చరణ్ తమిళ సినిమా “తనీ ఒరువన్’ రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తమిళ సినిమా తెలుగురీమేక్ వెర్షన్ లో నారా రోహిత్ విలన్ గా నటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తమిళంలో అరవింద్ స్వామి చేసిన పాత్రను రోహిత్ చేసే అవకాశాలున్నాయని సమాచారం. వాస్తవానికి అయితే తెలుగు వెర్షన్ లో కూడా అరవింద్ స్వామినే విలన్ పాత్రను చేయించాలనేది నిర్మాతల భావన. అయితే.. ఆయన ఓకే అంటాడా.. లేదా.. అనేది ఇంకా క్లారిటీలేదు.

ఈ నేపథ్యంలో ఈ సినిమాలో విలనిజాన్ని పండించడానికి  రోహిత్ పేరును కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది.  మరి ఈ సినిమాలో రోహిత్ కన్ఫర్మ్ అయితే.. కాంబినేషన్ విషయంలో కూడా ఈ సినిమా ఆసక్తికరమైనదే అవుతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -