Wednesday, May 8, 2024
- Advertisement -

బెనిఫిట్ షో ల మీద నట్టికుమార్ పోరాటం !

- Advertisement -

ఎదో ఒక విషయంలో మీడియా లో కనిపిస్తూ ఉండే వ్యక్తి నట్టి కుమార్, ఆయన ఇప్పుడు పెద్ద హీరోలకి వేసే బెనిఫిట్ షో ల విషయంలో కూడా కొత్త గొడవ కి దారి తీస్తున్నారు. పోలీసు శాఖ కి మూడు వేలు కట్టి అనుమతి పొంది మరీ వేస్తున్న ఈ షో ల టికెట్ రేట్లు సినిమా ని బట్టీ హీరోని బట్టీ మారుతూ వస్తున్నాయి.

ఐదొందల రూపాయలో వెయ్యి రూపాయలో పెట్టుకుని వెళ్ళే వెర్రి అభిమానుల కోసం వేస్తున్నారు ఈ షో లు.లక్షలు లక్షలు వెనకేసుకోవచ్చు. షో మీద వచ్చే డబ్బులు ఛారిటీ కోసం అని చెప్పి వ్యవహారం నడిపే జనాలు కూడా లేకపోలేదు. అందులో చాలా వరకు అబద్ధాలే. అయినా తమ హీరోల మీద అభిమానంతో ఫ్యాన్స్ ఎంతైనా పెట్టి టికెట్లు కొంటున్నారు తెల్లవారుజామునే సినిమా చూసి పరవశించిపోతున్నారు.

ఐతే ఈ బెనిఫిట్ షోలకు అనుమతులిచ్చే విషయంలో కొన్ని చోట్ల గొడవలు జరుగుతున్నాయి. బ్రూస్ లీ బెనిఫిట్ షో విషయం లో నట్టికుమార్ థియేటర్ లో వైజాగ్ లో అర్ధరాత్రి షో కి అనుమతి లేక ఉదయం ఏడుగంటలకి షో వెయ్యడం దాన్ని పోలీసులు అడ్డుకోవడం జరిగింది. షో ఆప మరీ నట్టికుమార్ థియేటర్ లైసెన్స్ రద్దు చేసేసారు పోలీసులు. దీని మీద కుమార్ భారీ పోరాటం చేస్తున్నారు ప్రస్తుతం.

 బాహుబలి సినిమాకు 23 థియేటర్లలో – శ్రీమంతుడుకి 18 థియేటర్లలో స్పెషల్ షోలకు విశాఖ జాయింట్ కలెక్టర్ అనుమతి ఇచ్చారని.. ఈ షోల ద్వారా వచ్చిన లాభాల్లో కొంత మొత్తం శాతాన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు – ఫర్నిచర్ కు కేటాయిస్తామని షోలు వేసిన సంస్థ హామీ ఇచ్చిందని.. కానీ తర్వాత ఒక్క పైసా కూడా ఇవ్వకుండా భారీగా వెనకేసుకుందని ఆరోపిస్తున్నాడు నట్టి. ఈ వ్యవహారమై అతను సీబీఐకి రిపోర్ట్ చేయడం విశేషం. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -