Saturday, April 20, 2024
- Advertisement -

జెర్సీ సినిమా షూటింగ్ లో నాని ముక్కుకు స్వల్ప గాయాలు..!

- Advertisement -

ఆటలు నేపథ్యంలో రూపొందే చిత్రాలకు ప్రత్యేక ఆదరణ ఉంటుంది. కథ బాగుంటే బాక్సాఫీస్‌ వద్ద కోట్లు కురిపించిన చిత్రాలు లేకపోలేదు. ఇక బాలీవుడ్‌లో గ‌తంలొ వచ్చి ‘దంగల్‌’, ‘ఎంఎస్‌ ధోని అన్‌టోల్డ్‌ స్టోరీ’ వంటివి విజయం సాధించాయి.

ఇక తెలుగులోనూ ఇదే తరహాలో సినిమాలు రానున్నాయి. టాలీవుడ్ స్టార్ నాని హీరోగా గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న జెర్సీ సినిమా తెర‌కెక్కుతోంది. ఈ సినిమాల్లో అందరూ యువ నటులే హీరోలుగా చేస్తుండడం మరో ప్రత్యేకత. ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హిరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో నాని క్రికెటర్ గా కనిపిస్తున్నాడు.

ఈసినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుపుకోంటోంది. త్వ‌ర‌గా షూటింగ్‌ను కంప్లీట్ చేసి వేస‌విలో ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేందుకు సినిమా యూనిట్ సిద్ద‌మ‌వుతోంది. అనుకోకుండా షూటింగ్ జరిగే సమయంలో నాని ముక్కుకు స్వల్ప గాయాలయ్యాయి. పెద్ద గాయాలు అవ్వ‌లేద‌ని కంగారు ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌ని సినిమా యూనిట్ తెలిపింది. ముక్కుకు చిన్న గాయం అయిందని, నాని కాసేపు రెస్ట్ తీసుకొని తిరిగి షూటింగ్ పాల్గొన్నాడని యూనిట్ నుంచి సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -