Wednesday, April 24, 2024
- Advertisement -

సంజ‌నాకు కౌంట‌ర్ ఇచ్చిన నాని..

- Advertisement -

బిగ్‌బాస్ రెండువ సీజ‌న్ మొద‌టి నుంచి మ‌రింత మ‌సాలా చెబుతున్న నాని దానిక తగిన‌ట్లుగానే ప్ర‌వ‌ర్తిస్తున్నాడు. బిగ్‌బాస్ మొద‌టి ఎలిమినేష‌న్‌లో భాగంగా సంజ‌న షో నుండి బ‌య‌టికి వ‌చ్చింది. బ‌య‌టికి వ‌చ్చి రావ‌డంతోనే బిగ్‌బాస్‌పై ఆరోప‌ణ‌లు చేసింది.కావ‌ల‌నే నన్ను బ‌య‌టికి పంపిచార‌ని,అంద‌రు క‌లిసి న‌న్ను టార్గెట్ చేశార‌ని చెప్పుకొచ్చింది. పైగా నాని యాంక‌రింగ్‌పై కూడ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది సంజ‌న‌. ఐఫోన్ వాడిన తరువాత నార్మల్ ఫోన్ వాడితే ఎలా ఉంటుందో, ఎన్టీఆర్ యాంకరింగ్ చూసిన తరువాత నాని యాంకరింగ్ నాకు అలానే అనిపించింది అంటూ నానిని తక్కువ చేసి మాట్లాడింది.

దీనిపై నాని కూడా స్పందించాడు. ”సేమ్ పించ్.. నాకు కూడా ఐఫోన్ అంటేనే ఇష్టం” అంటూ ట్వీట్ చేశాడు. నాని చేసిన ట్వీట్‌కు రెండు అర్థాలు ఉన్నాయి. ఎన్టీఆర్ యాంక‌రింగ్ అంటే త‌న‌కు ఇష్ట‌మ‌నేది ఒక‌టి. ఇక రెండోది ఎన్టీఆర్‌లా నేను ఐఫోన్ లాంటి వాడిన‌ని,నేను కూడా షోలో ఐఫోన్ లాంటి కంటెస్టంట్స్‌ను చూడాలన‌కుంటున్నాన‌ని అర్థం వ‌చ్చేలా నాని త‌న పోస్ట్ పెట్టాడు. సంజ‌న‌కు నాని త‌న స్టైల్‌లో భ‌లే కౌంట‌ర్ ఇచ్చాడ‌ని నాని అభిమానులు మెచ్చుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -