Saturday, May 11, 2024
- Advertisement -

మ‌రో టీవీ షోలో క‌నిపించ‌నున్న ఎన్టీఆర్‌?

- Advertisement -

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ వెండితెర‌పై గొప్ప న‌టుడు అన‌డంతో ఎటువంటి సందేహం లేదు. అదే స‌మ‌యంలో బుల్లితెరపై కూడా తాను సూప‌ర్ స్టార్‌నే అని నిరుపించుకున్నాడు. తెలుగు ‘బిగ్‌బాస్’ మొద‌టి సీజ‌న్‌కు యాంక‌రింగ్ చేశాడు ఎన్టీఆర్‌. ఇలాంటి షోలు తెలుగులో ఎవ‌రు చూడ‌రు అనే కామెంట్స్ వినిపించిన ఎన్టీఆన్ త‌న స్టార్‌డ‌మ్‌తో షోని ముందుండి న‌డిపించాడు. షోకి టాప్ రేటింగ్స్ రావ‌డానికి ఎన్టీఆర్ యాంక‌రింగ్ ఓ కార‌ణంగా చెప్ప‌వచ్చు. అయితే త్రివిక్ర‌మ్‌తో సినిమా ఉండ‌టం వ‌ల్ల బిగ్‌బాస్ రెండ‌వ సీజ‌న్‌కు దూరం అయ్యాడు ఎన్టీఆర్‌.

ఎన్టీఆర్ స్థానంలో న్యాచుర‌ల్ స్టార్ నాని ని వ్యాఖ్య‌త‌గా తీసుకున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ టీవీ షోల మీద ఉన్న మ‌మ‌కారంతో మ‌రో టీవీ ప్రొగ్రామ్‌లో క‌నిపించ‌నున్నార‌ని స‌మాచారం. ఈ షోలో ఎన్టీఆర్‌ యాంక‌రింగ్ చేయ‌డం లేదు.ఈ షోకి గెస్ట్‌గా వెళ్ల‌నున్నాడు ఎన్టీఆర్‌. ఈటీవీలో ప్ర‌సార‌మ‌య్యే డ్యాన్స్ ప్రొగ్రామ్ ‘ఢీ’ ఫైన‌ల్స్‌కు ఎన్టీఆర్ గెస్ట్‌గా రానున్నాడ‌ని తెలుస్తుంది. ఇదే నిజ‌మైతే ఎన్టీఆర్ ఈ షోకి వెళ్ల‌డం ఇది రెండ‌వసారి అవుతుంది. అంత‌క‌ముందు ఎన్టీఆర్ ఢీ ప్రొగ్రామ్‌కు ఓ సారి గెస్ట్‌గా వెళ్లారు. మ‌ళ్లీ ఇన్నాళ్లుకు ‘ఢీ’ ఫైన‌ల్స్‌కు వెళ్తున్నార‌ని స‌మాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -