హాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు అందరు కాస్టింగ్ కౌచ్ గురించే మాట్లాడుకుంటున్నారు.సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అన్యాయలపై పెద్ద ఉద్యమమే నడుస్తుంది.సినిమాలలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి లైంగికంగా వాడుకుంటున్నారు కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తులు.ఇక్కడ అమ్మాయిలకు సరైన రక్షణ లేదని వారి ప్రధాన ఆరోపణ.అయితే ఇండస్ట్రీలో అబ్బాయిలకు కూడా రక్షణ లేదని ఓ నటుడు సంచలన వాఖ్యలు చేశాడు.భోజ్ పురి నటుడు రవికిషన్ సినీ పరిశ్రమలో మహిళలకు మాత్రమే కాక పురుషులకూ లైంగిక వేధింపులు ఉంటాయని చెప్పుకొచ్చాడు.
తాజాగా ఇది రుజువు చేసే ఉదంతం ఒకటి బయటికి వచ్చింది.మలయాళ సినీ పరిశ్రమకు చెందిన నవజీత్ నారాయణ్ అనే నటుడికి ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందట. అతను ఒక సినిమా చిత్రీకరణ సందర్భంగా దర్శకుడి నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నాడట. తన కోరిక తీరిస్తే అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆ దర్శకుడు అతడికి ఆఫర్ ఇచ్చాడట. తన కోరిక తీరిస్తే అవకాశాలు ఇప్పిస్తానంటూ ఆ దర్శకుడు అతడికి ఆఫర్ ఇచ్చాడట.అంతటితో ఆగకుండా అతడి తొడపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడట. ఈ ఉదంతంతో పురుషుడికి కూడా రక్షణ లేదని తేలిపోయింది.