Friday, March 29, 2024
- Advertisement -

ఆ హీరోను ఒంట‌రిగా క‌ల‌వ‌నందుకు సినిమా నుంచి తీసేశారు

- Advertisement -

బాలీవుడ్ న‌టి ఇషా కోపిక‌ర్ షాకింగ్ కామెంట్స్ చేసింది. త‌న‌కు ఎదురైన అనుభ‌వాన్ని బ‌య‌ట‌పెట్టింది. ‘ఏక్‌ థా దిల్‌ ఏక్‌ థా ధడ్కన్‌’తో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది ఇషా. టాలీవుడ్ లోనూ కొన్ని సినిమాలు చేసింది. నాగార్జున‌తో చంద్ర‌లేఖ సినిమాతో మంచి గుర్తింపు పొందింది. కొంతకాలం క్రితం నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’ సినిమాలో ఓ కీ రోల్ చేసి తన సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది.

ప్రస్తుతం పూర్తిగా వెబ్ సిరీస్‌లకే పరిమితమైన ఇషా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్ లైఫ్ గురించి చెప్పుకొచ్చింది. త‌న కుటుంబంలో అంతా డాక్ట‌ర్ల‌ని చెప్పుకొచ్చిన ఇషా..పాకెట్ మ‌నీ కోసమే మోడ‌లింగ్ రంగంలోకి అడుగుపెట్టాన‌ని చెప్పింది. ఓ హీరోను ఒంట‌రిగా క‌లిసేందుకు వెళ్ల‌నందుకు త‌న‌ను సినిమా నుంచి తీసేశార‌ని ఇషా కోపిక‌ర్ సంచ‌ల‌న కామెంట్స్ చేసింది. హీరోయిన్‌గా తన కెరీర్ ప్రారంభించిన కొత్తలో తనకు ఓ నిర్మాత ఫోన్ చేశారట. తమ అప్‌కమింగ్ సినిమాలో ఇషానే హీరోయిన్‌గా అనుకుంటున్నామని, హీరోకు తను బాగా నచ్చేసిందని చెప్పారట.

అంతే కాకుండా హీరో తనను ఏకంతంగా కలవాలి అనుకున్నాడన్న విషయాన్ని కూడా ఇషా బయటపెట్టింది. అయితే ఇదే విషయాన్ని హీరోకు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకోగా.. నిజంగానే తనను ఏకాంతంగా రమ్మని చెప్పారట. వారి ప్రవర్తనతో బాధపడిన ఇషా.. తన టాలెంట్ చూసి సినిమా ఆఫర్లు వస్తేనే చేస్తానని గట్టిగా చెప్పేసిందట. దానికి ఆ నిర్మాతకు, హీరోకు కోపమొచ్చి తనను ఆ సినిమా నుండే తప్పించారని చెప్పింది ఇషా.

మహా మాయగాడి ఉచ్చులో బాలీవుడ్ భామలు

హాట్‌ టాపిక్‌గా మారుతున్న సెలబ్రిటీల బ్రేక్‌అప్‌లు

బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతున్న అనుసూయ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -