Saturday, May 4, 2024
- Advertisement -

నవదీప్.. చర్లపల్లి సెంట్రల్ జైలులో.. ఏం జరిగింది..?

- Advertisement -

నవదీప్.. హీరోగా చేసి.. ప్రస్తుతం సినిమాలో స్పేషల్ రోల్స్ చేస్తున్నాడు. గౌతమ్ ఎస్ఎస్సీ సినిమా నవదీప్ కు మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘చందమామ’ సినిమాతో బాగా పేరు వచ్చింది. ఇక ఇటివలే బుల్లితెరపై సంచలనం సృష్టించిన బిగ్‌బాస్‌ రియాలిటీ షోలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు.

అంతేకాదు టాలీవుడ్‌లో కలకలం సృష్టించిన డ్రగ్స్ కేసులో ఇటీవల సిట్ విచారణ ఎదుర్కొన్న నవదీప్.. తాజాగా చర్లపల్లి సెంట్రల్ జైలుకు వెళ్లాడు. అక్కడే దీపావళి పండుగను జరుపుకున్నాడు. చర్లపల్లి జైలు సిబ్బందితో కలిసి దిగిన ఫొటోను సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు నవదీప్. తను నటిస్తున్న తాజా చిత్రం షూటింగ్‌లో భాగంగా నవదీప్ చర్లపల్లి జైలుకు వెళ్లినట్లు ఆ ఫొటోను బట్టి తెలుస్తోంది. ఆ ఫోటోలో నవదీప్ తో పాటు బిగ్ బాస్ రన్నర్ ఆదర్శ్, కమెడియన్ రచ్చరవి కూడా ఉన్నారు.

జైలు సిబ్బంది, ఇతర నటీనటులతో కలిసి దిగిన ఫొటోను నవదీప్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అది ట్రెండింగ్ గా మారింది. జైల్లో దిగిన ఫొటోను నవదీప్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. బిగ్ బాస్ హౌస్‌లో సమాజంతో ఎలాంటి సంబంధం లేకుండా గడిపిన అనుభవంతో.. వీరికి ఖైదీల పరిస్థితి అర్థమైంది. ఏది ఏమైన నవదీప్ రొటిన్ గా ఇంట్లో కాకుండా జైల్లో దీపావలి జరుపుకున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -