Saturday, May 18, 2024
- Advertisement -

జియో రేట్లు పెంచేశారు.. ఇక జియో యూజర్లకు షాకే

- Advertisement -

జియో ఎప్పుడు ఏదో ఒక సంచలనం సృష్టిస్తునే ఉంది. జియో ఫీచర్ ఫోన్‌తో మరోసారి యూజర్లను ఆకర్శించింది. ఇప్పుడు మూడు నెలలకు రూ.399 ప్లాన్ ఉంది. దీనిని ఒక్క నేలకు మాత్రమే చేసే లెక్కలు వేస్తున్నారట. జియో ఒక్కసారిగా 24% టారిఫ్ రేట్లను పెంచేసి కస్టమర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రైమ్ కస్టమర్లు రూ.399తో రీచార్జి చేసుకుంటే రూ.400 సమానమైన వోచర్లు ఇచ్చి 100% క్యాష్ బ్యాక్ వచ్చే సదుపాయాన్ని ఆస్వాదించే లోపే మొత్తం జియో కస్టమర్లకు సంబంధించి రిలయన్స్ జియో పిడుగు లాంటి వార్త చెప్పింది. ముఖ్యంగా రూ.309, రూ.409, రూ.509, రూ.799, రూ.799 ప్లాన్లలో మార్పులు జరిగాయి. రూ.309 రీచార్జీ చేసుకుంటే ఇకపై 28 రోజుల పాటు 30జీబీ డేటా వస్తుంది. రోజువారీ పరిమితి 1జీబీ. రూ.409 రీచార్జిపై మొత్తం 20జీబీని 28 రోజుల పాటు అందిచనున్నారు. రోజువారీ పరిమితి లేదు. 84 రోజుల ప్లాన్ ఇది వరకూ రూ.399 ఉండేది. దీని ధరలను ఇప్పుడు రూ.459 కు పెంచారు. రూ.509 స్కీమ్‌ ప్రయోజనాలను తగ్గించింది. అంతే కాకుండా బిల్లింగ్‌ సైకిల్‌ను 56 రోజుల నుంచి 49కు కు తగ్గించామని పేర్కొంది.

ఇక రూ.999 ప్లాన్‌లో గతంలో ఆఫర్‌ చేసిన 90 జీబీ 4 జీ డేటాను 30 జీబీకి తగ్గించామని తెలిపింది. తక్కువ ధరకే డేటా, కాల్స్ ఇవ్వడం వల్ల యూజర్లు ఎక్కువగా వాడుతున్నారు. ఈ నెపథ్యంలో జియో ధర పెంచితే ఏమవుతుంది? జియో త్వరలోనే 24 శాతం టారిఫ్ పెంచితే అటు డేటా, ఇటు కాల్స్‌, మేసేజ్‌లు మునుపటిలా చవకగా రావు. ఆ క్రమంలో వినియోగదారులు జియో వాడటం మానేసే అవకాశం ఉంది. మరి జియో సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -