Sunday, May 12, 2024
- Advertisement -

జ‌గ‌న్ పాద‌యాత్ర అనుమ‌తి పిటీష‌న్‌పై నేడే తీర్పు

- Advertisement -

రాష్ట్ర‌వ్యాప్తంగా జ‌గ‌న్ చేప‌ట్ట‌ద‌ల‌చిన అన్న‌వ‌స్తున్నాడు పాద‌యాత్ర‌పై ఉత్కంఠ నెల‌కొంది. ఇప్ప‌టికె కోర్టు అనుమ‌తి రాక వాయిదాప‌డుతూ ప‌డింది. అయితె జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు అనుమ‌తి సీబీఐ కోర్టు ఇస్తుందా లేదా అన్న‌ది మ‌ధ్య‌హ్నం తేల‌నుంది. గ‌తంలో ఇద్ద‌రి వాద‌న‌లు విన్న సీబీఐ కోర్టు కేసును ఈరోజుటికి వాయిదా వేసింది. పాద‌యాత్ర‌కు మిన‌హాయింపును ఇవ్వ‌కుండ అడ్డుకొనేందుకు సీబీఐ కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. ప్ర‌స్తుతం నాంప‌ల్లి సీబీఐ కోర్టులో విచార‌న జ‌రుగుతోంది.

నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో వైకాపా అధినేత వైఎస్ జగన్ దాఖలు చేసిన రెండు కీలక పిటిషన్లపై విచారణ మొదలైంది. ఏపీలో ప్రతిపక్ష నేతగా ప్రజల సమస్యలను తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపేందుకు పాదయాత్రను చేపట్ట నిర్ణయించామని, అందుకు అనుమతించాలని జగన్ ఇప్పటికే కోరిన సంగతి తెలిసిందే.

నవంబర్ 2 నుంచి ఆరు నెలలపాటు పాద‌యాత్ర‌ను చేస్తున్నాన‌ని కోర్టుకు తాను రాలేనని, ప్రత్యక్ష హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ కోరగా, అంత సౌకర్యాన్ని ఇచ్చేంత స్థాయిలో జగన్ లేరని, ఆయన చేసింది చిన్న తప్పు కాదని గత వారంలో సీబీఐ వాదించింది. దీనిపై ప్రస్తుతం ఇరు పక్షాల వాదనలు జ‌రుగుతున్నాయి.

అయితె మధ్యాహ్నం తరువాత జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణుల అంచనా. ఇదిలావుండగా, అక్రమాస్తుల కేసు తప్పుడుదని, తమ పేర్లను తొలగించాలని కోరుతూ జగన్, విజయసాయిరెడ్డి వేసిన పిటిషన్లపైనా నేడు విచారణ మొదలుకానుంది. సీబీఐ కోర్టు ఇచ్చే తీర్పుపైనె పాద‌యాత్ర ఆధార‌ప‌డింది. మ‌రో వైపు నాయ‌కులు,కార్య‌క‌ర్త‌ల్లోను ఉత్కంఠ నెల‌కొంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -