Wednesday, May 15, 2024
- Advertisement -

నాగ్ ఆఫీస‌ర్‌ నుంచి నవ్వే నువ్వు.. నవ్వకపోతే సాంగ్ రిలీజ్‌

- Advertisement -

శివ సినిమా తర్వాత దాదాపు 25 సంవత్సరాల అనంతరం వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. అక్కినేని నాగార్జునతో ”ఆఫీసర్” సినిమా చేస్తున్నాడు. ఆఫీసర్ సినిమా స్టోరీ కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ ఆఫీసర్ కథ అని వివరించాడు. 2010లోనే అతడి గురించి తెలుసుకున్న తాను ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వివరించాడు. కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి కెఎమ్ ప్రసన్న చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించినట్లు తెలిపారు.

యాక్షన్ మూవీగా నిర్మితమైన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి మొదటి సాంగ్ గా ‘నవ్వే నువ్వు’ అనే సాంగ్ ను రిలీజ్ చేశారు. తండ్రీ కూతుళ్ల మధ్య గల ఎమోషన్ దృశ్యాలతో ఈ సాంగ్ కొనసాగుతోంది. ఒక వైపున తండ్రీ కూతుళ్ల మధ్యగల అనుబంధానికి అద్దం పడుతూనే, మరో వైపున వృత్తి పరంగా నాగ్ కి సంబంధించిన యాక్షన్ సీన్స్ ఈ సాంగ్ లో చోటుచేసుకున్నాయి.

తండ్రి-కూతుళ్ల సెంటిమెంట్‌ ఆధారంగా సాగే ఈ పాటను సిరాశ్రీ రచించారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన వర్మకు సిరాశ్రీ థాంక్స్‌ చెప్పగా, తనదైన స్టైల్‌లో వర్మ రిప్లై కూడా ఇచ్చాడు. ఈ చిత్రానికి రవి శంకర్‌ మ్యూజిక్‌ అందిస్తున్నాడు. నాగార్జున, మైరా సరీన్‌, అజయ్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఆఫీసర్‌ జూన్‌ 1న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -