Thursday, May 9, 2024
- Advertisement -

స్వ‌ల్ప‌లాభాల‌తో ముగిసిన స్టాక్ మార్కెట్లు….

- Advertisement -

వ‌రుస మార్కెట్ న‌ష్టాల‌కు బ్రేక్ ప‌డింది. ఆసియా మార్కెట్ల మిశ్రమ సంకేతాలతో పాటు చమురు ధరల ప్రభావం మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. దీంతో ఆరంభంలో కాస్త ఫర్వాలేదనిపించినా.. చివరకు ఆ లాభాల్లో కొంత కోల్పోవాల్సి వచ్చింది.

సెన్సెక్స్‌ 35 పాయింట్ల లాభంలో 34,651 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంలో 10,536 వద్ద క్లోజయ్యాయి. పీఎస్‌యూ బ్యాంకింగ్‌, ఆటో, మెటల్‌ స్టాక్స్‌లో నెలకొన్న కొనుగోళ్లతో కీలక సూచీలు నేడు లాభాల్లోకి ఎగిశాయి. టాప్‌ గెయినర్లుగా ఎస్‌బీఐ, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబోరేటరీస్‌, టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటోలు 3-6 శాతం లాభాలు ఆర్జించాయి

స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా షేర్లు కూడా ఫలితాల ప్రకటన తర్వాత 6 శాతం మేర జంప్‌ చేసింది. క్యూ4లో భారీగా రూ.7,718 కోట్ల నష్టాలను నమోదు చేసినప్పటికీ ఎస్‌బీఐ షేరు విలువ 4శాతానికి పైగా పెరిగింది.

ఐవోసీ, అల్ట్రాటెక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, ఇండస్‌ఇండ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఐటీసీ, టీసీఎస్, పవర్‌గ్రిడ్‌, కొటక్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ 3.5-0.8 శాతం మధ్య క్షీణించాయి. గత ఐదు సెషన్లలో మాత్రం బీఎస్‌ఈ సెన్సెక్స్‌ మొత్తం 940 పాయింట్ల మేర కోల్పోయింది. నిఫ్టీ 289 పాయింట్లు నష్టపోయింది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -