Monday, May 6, 2024
- Advertisement -

మ‌హిళ‌ల ఐపీఎల్‌లో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని సూపర్‌నోవాస్ గెలుపు

- Advertisement -

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రయోగాత్మకంగా మంగళవారం నిర్వహించిన మహిళల ఐపీఎల్ మ్యాచ్‌ అభిమానుల్ని ఆకట్టుకుంది. వాంఖడే వేదికగా ఆఖరి బంతి వరకూ ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలోని సూపర్‌ నోవాస్ జట్టు 3 వికెట్ల తేడాతో గెలుపొందింది.

సూపర్‌నోవాస్ టీమ్‌కు హర్మన్‌ప్రీత్ కౌర్, ట్రయల్ బ్లేజర్స్ టీమ్‌కు స్మృతి మందానా కెప్టెన్లుగా వ్యవహరించారు. తొలుత టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన స్మృతి మంధాన నాయకత్వంలోని ట్రయల్ బ్లేజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 129 పరుగులు చేసింది.

ఛేదనలో సూపర్‌ నోవాస్ జట్టుకి ఓపెనర్లు మిథాలీ రాజ్ (22: 17 బంతుల్లో 3×4, 1×6), డానియెలె వ్యాట్‌ (24: 20 బంతుల్లో 2×4, 1×6) మెరుపు ఆరంభాన్నివ్వగా.. మిడిలార్డర్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (21: 23 బంతుల్లో 1×4) రాణించడంతో ఆ జట్టు అలవోక విజయాన్ని అందుకునేలా కనిపించింది.

సూపర్‌నోవాస్‌ గెలవాలంటే 6బంతుల్లో 4 పరుగులు కావాల్సి వచ్చింది. ఆ సమయంలో బంతి అందుకున్న ట్రయల్‌బ్లేజర్స్‌ బౌలర్‌ సుజీ బేట్స్‌ కట్టుదిట్టంగా బంతులు విసురుతూ..తమ జట్టును గెలిపించే ప్రయత్నం చేసింది. కానీ సూపర్‌నోవాస్‌ బ్యాట్స్‌ఉమెన్‌ ఎలిస్‌ పెర్రీ (13; 14బంతుల్లో 1×4), పూజ వస్త్రకర్‌ (2; 3బంతుల్లో) ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా చివరి బంతి వరకూ పోరాడి జట్టుకు అద్భుత విజయాన్ని అందించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -