- Advertisement -
జబర్దస్త్ ఫేం యాంకర్ అనసూయ పుల్‌టైం టాలివుడ్ యాక్టర్‌గా మారెందుకు ప్రయత్నిస్తోంది.
అందులో భాగంగానే అడవి శేషు డైరెక్షన్‌లో క్షణం సినిమాని, సోగ్గాడే చిన్ని నాయినా సినిమాలో ఒక మంచి రోల్ పర్ఫామ్ చేస్తోందని తెలుస్తోంది. దీనికి సంబందించి ఒక పోస్టర్‌ను నాగార్జున ఫేస్‌బుక్‌లో పెట్టడంతో అనసూయ బెర్త్, ఈ సినిమాలో కన్ఫార్మ్ అయినట్లే అని తెలుస్తోంది.
ఈ సినిమాలో నాగార్జున ఒక మద్య తరగతి కుటుంబానికి సంబందించిన వ్యక్తిగా కనిపిస్తాడట. ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న విధానం చూస్తుంటే.. అనసూయకు ముఖ్యమైన పాత్రను ఇచ్చినట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి పాత్రను ఇచ్చారో తెలియాలంటే రిలీజ్ వరకు ఆగాల్సిందే..
