Wednesday, May 7, 2025
- Advertisement -

క‌మ‌ల్‌తో సై అంటోన్న నయనతార

- Advertisement -

క‌మ‌ల్‌హాస‌న్ న‌ట‌న గురించి ప్ర‌త్యేకంగా ఇప్పుడు చెప్పుకోవాడినికి ఏం ఉంది.త‌న న‌ట‌న‌తో లోక‌నాయ‌కుడిగా పేరు గ‌డించాడు క‌మ‌ల్‌.అలాగే హీరోయిన్ న‌య‌నతార కూడా త‌న న‌ట‌న‌తో మంచి పేరు సంపాదించుకుంది. నటనకి అవకాశమున్న పాత్రలకి ప్రాధాన్యతను ఇవ్వడం వల్లనే ఆమె ఈ స్థాయి క్రేజ్ ను సొంతం చేసుకోగలిగింది. మ‌రి అలాంటి న‌య‌న‌తార క‌మ‌ల్‌తో పోటికి సై అంటోంది. నయనతార న‌టించిన తాజా చిత్రం కోకిల.

ఈ సినిమాలో డ్రగ్స్ అమ్మే యువతిగా నయనతార కనిపిస్తుంది.ఈ సినిమాను ఆగస్టు 10వ తేదీన విడుదల చేయనున్నారు. అదే రోజున కమలహాసన్ ‘విశ్వరూపం 2’ సినిమా కూడా థియేటర్లకు రానుంది. తమిళనాట కమల్ కి గల క్రేజ్ తెలియంది కాదు .. బడ్జెట్ పరంగా భారీతనం కలిగినదిగా ‘విశ్వరూపం 2’ సినిమా కనిపిస్తుంది. మ‌రి క‌మ‌ల్‌తో పోటి నిల‌బ‌డి న‌య‌న గెలుస్తుందా? అని అంద‌రిలోను అనుమానం ఉంది.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -