Wednesday, May 1, 2024
- Advertisement -

కలెక్టర్ల కోసం హీరోయిన్ సినిమా ప్ర‌త్యేక షోలు

- Advertisement -

మంచి సందేశాత్మ‌క సినిమా.. త‌మిళంలో సూప‌ర్‌హిట్‌గా నిలిచిన హీరోయిన్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తూ ‘కర్తవ్యం’ సినిమా విడుద‌ల చేయ‌నున్నారు. నయనతార ప్రధాన పాత్రలో రూపొందిన తమిళ సినిమా ‘ఆరమ్’ను ‘కర్తవ్యం’ పేరుతో రిలీజ్ కానుంది. గోపి నైనర్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై శరత్ మరార్ సినిమాను అందిస్తున్నారు. ఐఏఎస్ పాత్ర చుట్టూ నడిచే ఈ సినిమాను కలెక్టర్ల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించనున్నారు.

మార్చి 15వ తేదీన గురువారం సాయంత్రం ఈ ప్ర‌త్యేక షోలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లను ఆహ్వానించారు. నెల్లూరులోని సిరి మల్టీప్లెక్స్‌లో సాయంత్రం 7 గంటలకు, కాకినాడలోని చాణుక్య థియేటర్‌లో 6.15 నిమిషాలకు ఈ సినిమా ప్ర‌త్యేక షో వేయనున్నారు. మంచి సామాజిక సందేశంతో రూపొందిన ఈ సినిమాను రేపు శుక్ర‌వారం (మార్చి 16)న ప్రేక్షకుల కోసం థియేట‌ర్ల‌లో విడుద‌ల చేస్తున్నారు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -