Sunday, May 19, 2024
- Advertisement -

పిచ్చి పచ్చ మీడియా బ్యాచ్….. బుర్ర ఉండే వార్తలు రాస్తారా?

- Advertisement -

మీడియా సంస్థ స్థాపన దినోత్సవం వచ్చేసరికి మా అంత తోపు జర్నలిస్టులు లేరు అని గంటలు గంటలు వాళ్ళ భజన వాళ్ళే చేసుకుంటారు. అబద్ధాలతో భజన ప్రచారం చేసుకోవడంలో ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉండే స్థాయి నాయకుడి భజన బృంద మీడియా సంస్థల తీరు కూడా ఆ ఫార్టీ ఇయర్స్ నాయకుడిలానే ఉంటుంది. కానీ వాళ్ళ రాతలను చూస్తే మాత్రం కనీసం కామన్‌మేన్‌కి ఉన్నంత బుర్ర కూడా ఉన్నట్టుగా కనిపించదు. అసలు కామన్‌సెన్స్ వాడరా అనిపిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థపై కనీస స్థాయి అవగాహన అయినా ఉందా అన్న అనుమానం వస్తుంది.

ఆంధ్రజ్యోతి మీడియా సంస్థ ఒక కథను అందంగా వండి వార్చింది. విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి మోడీ అపాయింట్‌మెంట్ కోసం ప్రధాని కార్యాలయం దగ్గర వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో తెలుగు మీడియా జర్నలిస్టులు అటుగా వెళ్ళేసరికి వాళ్ళను చూసి విజయసాయి పారిపోయాడు అని. అసలు ఇంత మూర్ఖంగా, తెలివితక్కువగా ఇంకెవరైనా వార్త రాయగలరా? చదివిన జనాలు నవ్వుకోరా? అసలు ఈ వార్తను నమ్మేవాళ్ళ శాతం ఎంత ఉంటుంది? ఇలాంటి విషయాలను పక్కనపెడితే హైదరాబాద్‌ని నిర్మించింది చంద్రబాబే అనే స్థాయిలో పచ్చ మీడియా ప్రచారం చేస్తోంది కదా. ఆ ప్రచారాన్ని కొంతమంది మూర్ఖంగా నమ్మేశారుగా. ఈ వార్త కూడా అలాంటి జనాల కోసమే.

ప్రధానమంత్రి కార్యాలయంలో మీడియా జనాలు ఎప్పుడూ ఉంటారు. ప్రధానిని ఎవరు కలిసినా కూడా కలిసిన టైం, వ్యక్తి పేరు, హోదాతో సహా అన్ని వివరాలు రికార్డెడ్‌గా ఉంటాయి. అలాంటప్పుడు రాజ్యసభ సభ్యుడు అయిన విజయసాయిరెడ్డి దొంగతనంగా ప్రధానమంత్రిని కలవాలని ప్లాన్ చేశాడనే స్థాయిలో అత్యంత అజ్ఙానంతో వార్తను ఎలా వండి వార్చారు? ప్రధానమంత్రిని కలిశాక ఆ వివరాలు నెట్‌లో అధికారికంగా ఉంటాయన్న విషయం విజయసాయికి తెలియదా? ఇదేమైనా చీకట్లో చిదంబరాన్ని ఆయన ఇంట్లో కలవడం లాంటి వ్యవహారమా? డైరెక్ట్‌గా ప్రధానమంత్రి కార్యాలయంలోనేగా విజయసాయి కలవాలనుకున్నాడు. అసలు విజయసాయి ప్రధానిని కలవాలనుకున్నాడో లేదో కూడా తెలియదు. అత్యంత అవివేకి అయిన ఒక జర్నలిస్ట్ వైకాపాపై, జగన్‌పై, విజయసాయిపై విషప్రచారం చేయాలనుకున్నాడు. తనకు తోచింది రాసేశాడు. ఇక ఇతర పచ్చ మీడియా సంస్థలన్నీ అందిపుచ్చుకున్నాయి. ఎద్దు ఈనింది అంటే దూడను కట్టెయ్యండి అన్న చందంగా అదే వార్తను రాసిపడేశాయి. ఇక్కడ నిజానిజాలతో పచ్చ మీడియాకు అస్సలు పనిలేదు. జగన్‌కి నష్టం చేసే వార్త అయితే చాలు. సంవత్సరాలుగా పచ్చ మీడియా బ్యాచ్ అంతా చేస్తున్నది ఇదేగా. కాకపోతే 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రావడం ఖాయం అన్న సర్వేల నేపథ్యంలో ఈ సారి ఇంకా ఇంకా దిగజారుడు స్థాయి వార్తలు రాయడానికి రెడీ అయిపోతున్నారు. వాళ్ళ అజ్ఙానాన్ని పూర్తిగా బయటపెట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -