Wednesday, May 1, 2024
- Advertisement -

ప్రేమ‌లో ముంచుతున్న న‌య‌న‌తార

- Advertisement -

తెలుగు త‌మిళ భాష‌ల‌లో అగ్ర‌న‌టిగా రాణిస్తున్న న‌య‌న‌తార గురించి మ‌నం ప్ర‌త్యేకంగా చేప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. న‌య‌న‌తార ఎంత ఫేమ‌సో అంత‌క‌న్నా ఎక్కువ‌ ఆమె ల‌వ్ స్టోరిస్ ఫేమ‌స్. ఒక్క‌రు కాదు ఇద్ద‌రు కాదు ఏకాంగా ముగ్గురుతో ఆమె ప్రేమ‌యాణం సాగించింది న‌య‌న‌తార‌.మొద‌ట హీరో శింబుని ప్రేమించింది న‌య‌న‌తార‌.వీరిద్ద‌రు పెళ్లి కూడా చేసుకున్నారు అనే వార్త‌లు అప్ప‌ట్లో వచ్చాయి. త‌రువాత ఏమైందో తెలియ‌దు కాని వారిద్ద‌రు విడిపోయారు.దీనిపై అటు శింబు కాని ఇటు న‌య‌న‌తార కూడా దీని గురించి ఎక్క‌డ స్పందించ‌లేదు కొన్నాళ్లు త‌రువాత న‌య‌న‌తార మ‌రోసారి ప్రేమ‌లో ప‌డింది.ఈసారి డాన్స్ మాస్ట‌ర్‌,హీరో,డైర‌క్ట‌ర్ అయ్యిన ప్ర‌భుదేవాను ప్రేమించింది.అప్ప‌ట్లో ఎక్క‌డ చూసిన ఈ జంటే క‌నిపించేది.ప్ర‌భుదేవా న‌య‌న‌తార‌ను పెళ్లి చేసుకోవాడానికి మొద‌టి భార్య‌కు విడాకులు కూడా ఇచ్చాడు.కాని మొద‌టి భార్య పిల్ల‌ల విష‌యంలో వీరిద్ద‌రికి గొడ‌వ జ‌రిగి విడిపోయారు. మ‌ళ్లీ ఇప్పుడు న‌య‌న‌తార మ‌రో వ్య‌క్తితో ప్రేమ‌తో ఉంది. ఆయ‌న ఎవ‌రో కాదు , యువ దర్శకుడు విఘ్నేశ్ శివన్‌.

వీరిద్దరూ ప్రేమించుకుంటున్నట్లు బయట పడకపోయినా చాలాసార్లు అలాంటి భావాన్ని వ్యక్తం చేసేలా ప్రవర్తిస్తున్నారు. నయనతార పుట్టిన రోజుకు విఘ్నేశ్‌శివ శుభాకాంక్షలు తెలపడం, ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇద్దరూ కలిసి అందమైన నగరం ప్యారిస్‌ చెక్కేయడం, క్రిస్మస్‌ పండుగను కలిసి జరుపుకోవడం లాంటి చర్యలు వారిద్దరూ ప్రేమించుకుంటున్నారనే విషయాన్ని చెప్పకనే చెబుతున్నాయి.నయనతార, విఘ్నేశ్‌శివ సహజీవనం చేస్తున్నారనే ప్రచారం చాలా కాలంగానే జరుగుతోంది. తాజాగా మరోసారి ఈ ప్రేమజంట కలిసి ఎంజాయ్‌ చేసిన ఫొటోలను ఇంటర్నెట్‌లో విడుదల చేశారు. ప్రేమికుల రోజు సందర్భంగా నయనతార, విఘ్నేశ్‌శివ ఒకటై తీసుకున్న ఆ కొత్త ఫొటో ఇప్పుడు సోషల్‌ మీడియాల్లో వైరల్‌ అవుతోంది. చూడాలి ఈ ప్రేమ ఎన్ని రోజులు ఉంటుందో.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -