Wednesday, May 15, 2024
- Advertisement -

చిరుకి నయనతారనే కరెక్ట్ అని..!

- Advertisement -

మెగాస్టార్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న సినిమా చిరంజీవి 150 వ సినిమా. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కత్తి’ సినిమా తెలుగులో  చిరంజీవి 150 వ సినిమా గా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకేక్కుతుంది. మరి ఈ సినిమా లో ఎవరు హిరోయిన్?, ఎవరు విలన్? అనే చర్చ సినీ పరిశ్రమలో జరుగుతుంది.

ఐతే తాజా సమాచారం ప్రకారం చిరు సినిమా లో హీరోయిన్ గా నయనతారను ఓకే చేసారట. ఒరిజినల్ చిత్రం లోని సమంత పాత్ర్ర లో నయనతార కనిపించబోతుంది. నయనతార అయితే పెద్ద్ హీరోల పక్కన నటించిన అనుభవం ఉంది అందులో చిరు పక్కన అయితే నయన బాగుంటుందని ఎంపిక చేసారు అని సమాచారం.

కొద్ది రోజుల్లోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది. ఇంకా విలన్, మిగిత నటినటులను ఎంపిక చేసే పనిలో ఉంది వినాయక్ టీం. తెలుగు నెటివిటికి తగ్గటుగా వినాయక్ కథను మార్చడట. చిరు సినిమాలో నయనను ఎంపిక చేసినందుకు మెగా అభిమానులు అనందపడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -