Saturday, April 27, 2024
- Advertisement -

కిల్లింగ్ వీరప్పన్ మూవీ రివ్యూ

- Advertisement -

తెలుగు సినిమా గమనాన్ని పూర్తిగా మార్చేసిన డైరెక్టర్ లలో రాం గోపాల్ వర్మ ప్రప్రధమ స్థానంలో కనపడతారు . శివ సినిమాతో ఒక కొత్త ఒరవడి సృష్టించిన ఈయన ఈ మధ్య కాలం లో పూర్తిగా ఫార్మ్ ని కోల్పోయి ప్రవర్తిస్తున్నారు. ఆయన వ్యక్తిగత జీవిత విషయం నుంచీ సినిమాల వరకూ ఎవరికీ అంతుపట్టని, కొరుకుడు పడని ఒక వస్తువుగా ఉండిపోయిన రాం గోపాల్ వర్మ. కన్నడ సూపర్ స్టార్ శివ  రాజ్ కుమార్ తో ‘కిల్లింగ్ వీరప్పన్’ అంటూ తీసిన ఈ సినిమా ఎలా ఉందొ చూద్దాం. 

కథ – పాజిటివ్ అంశాలు : 

వీరప్పన్ గురించి తెలియని వారు లేరు, అతని క్రిమినల్ యాక్టివిటీస్ అన్నిటినీ లెక్క పెడితే పెద్ద గ్రంథమే అవుతుంది, ఆ గ్రంథం విస్తారం అవుతుంది. అందుకే కాబోలు రాం గోపాల్ వర్మ లాంటి దిగ్గజ దర్శకుడు కూడా కేవలం వీరప్పన్ ని చంపిన అంశాన్ని మాత్రమే తీసుకుని దాని గురించి చర్చించడం కోసం ఈ సినిమా తీసాడు. ఒక పోలీస్ ఆఫీసర్ ( శివరాజ్ కుమార్ ) నారా హంతకుడు, ఉన్మాది , స్మగ్లర్ వీరప్పన్ ని చంపడం కోసం చేసిన ప్రయత్నం అందులో అతను తెలుసుకున్న నిజాలు, పడ్డ కష్టాలు, చివరికి అతను సాధించిన ఫలితం ఇలాంటివి కన్సిడర్ చేస్తూ సాగింది ఈ సినిమా. శివరాజ్ కుమార్ కి ఈ సినిమాలో పేరు లేకపోవడం పెద్ద విశేషం. కొత్త పాత్రలో శివరాజ్ కుమార్ చాలా పెర్ఫెక్ట్ గా చేసాడు. డైనమిక్ పోలీస్ పాత్రలో చాలా కొత్తగా అనిపించాడు. హీరోయిన్ పారుల్ యాదవ్ కి పెద్ద స్కోప్ లేదు. సంజయ్ భరద్వాజ్ – వీరప్పన్ గా చేసిన తీరు అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. వీరప్పన్ ఆహార్య,  బాడీ లాంగ్వేజ్ దగ్గర నుంచీ ప్రతీ చిన్న విషయం లో అతను జాగ్రత్త తీసుకుని ఆదరకోట్టేసాడు.రామూ కి ఇంతకంటే మంచి యాక్టర్ వీరప్పన్ గా దక్కడు అని తేలికగా చెప్పచ్చు. నేషనల్ అవార్డు విన్నింగ్ ఆక్టర్ సంచారి విజయ్ పరవాలేదు అనిపించాడు. యజ్ఞ శెట్టి వీరప్పన్ భార్యగా బాగానే చేసింది. సినిమా లో చాలా చోట్ల రామూ సినిమాటోగ్రఫీ తాలూక ప్రయోగాలు కనపడ్డం విశేషం. సినిమాని చాలా జాగ్రత్త తో జాగురత తో తీసారు రామూ అని చెప్పచ్చు. కథ మొత్తాన్నీ చక్కగా రాసుకున్నారు ముందు. ఒక బందిపోటు హంతకుడుని మెయిన్ లీడ్ గా చూపిస్తూ రామూ చేసిన ఈ ప్రయోగం అదరహో అనిపించుకుంటుంది. 

 

నెగెటివ్ లు : 

సినిమా నిడివి తక్కువ కావడం తో నెగెటివ్ లు పెద్దగా లేవనే చెప్పులి. సెకండ్ హాఫ్ లో అక్కడక్కడా సినిమా కాస్త స్లో గా నడుస్తుంది. ఇంకాస్త ఎడిటింగ్ బెటర్ గా ఉంటే బాగుండేది. ఎంటర్టైన్మెంట్ పాళ్ళు సూన్యం. యజ్ఞ శెట్టి స్థానం లో మరెవరైనా ఉంటే బాగుండేది అనిపించింది. వర్మ పైత్యం కూడా చాలా చోట్ల కొట్తోచ్చినట్టుగా కనిపిస్తుంది. 

 

మొత్తంగా : 

మొత్తం మీద కిల్లింగ్ వీరప్పన్ రాం గోపాల్ వర్మ కి బ్యాక్ టూ ది ఫార్మ్ సినిమా అని ఘంటా పదంగా చెప్పచ్చు. ఈ సంవత్సరం లో నేను శైలజ తో సూపర్ హిట్ ద్వారా మొదలైన తెలుగు పరిశ్రమ కి మరొక హిట్ సినిమా రావడం అది కూడా రామూ లాంటి సాహసోపేత డైరెక్టర్ ద్వారా రావడం మరింత ఆనందకరమైన విషయం. రామూ సినిమాలు అలవాటు ఉండి, ప్రయోగాత్మక సినిమాలు ఎంకరేజ్ చేసే వారికి ఈ సినిమా మస్ట్ వాచ్ అన్నమాట. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -