Monday, May 6, 2024
- Advertisement -

న‌య‌న‌తార అయితేనే సినిమా చేస్తా: శివకార్తికేయన్‌

- Advertisement -

హీరోయిన్ న‌య‌న‌తార క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు.ఈమె డేట్లు కోసం ప‌లువురు స్టార్ హీరోలు సైతం ఎదురు చూస్తుంటారు.అరమ్‌ చిత్రం తరువాత లేడీ సూపర్‌స్టార్‌ పట్టంతో వెలిగిపోతుంది న‌య‌న‌తార. తాజాగా ఆమె న‌టించిన కోకిల సినిమా టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లైంది.న‌య‌నతార కోసం కుర్ర హీరోలు సైతం క్యూ క‌డుతున్నారు.తాజాగా నయనతార మరోసారి శివకార్తికేయన్‌తో రొమాన్స్‌ చేయడానికి రెడీ అవుతోంది.వేలైక్కారన్‌ చిత్రం తరువాత శివకార్తికేయన్‌తో మరోసారి రొమాన్స్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.

రాజేశ్‌.ఎం దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శివకార్తికేయన్‌. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవల జరిగింది. ఇందులో నటి సాయిపల్లవిని కథానాయకిగా ఎంపిక చేశారు. అయితే శివకార్తికేయన్‌ సాయిపల్లవిని వద్దన్నట్లు, నయనతారే కావాలని పట్టు పట్టినట్లు సినీ వర్గాల టాక్‌. ఈ విషయాన్ని శివకార్తికేయన్‌తో రెమో, వేలైక్కారన్‌ వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన, ప్రస్తుతం ఆదే హీరోతో సీమరాజా చిత్రాన్ని నిర్మిస్తున్న నిర్మాత ఆర్‌డీ.రాజా తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ప్ర‌స్తుతం నయనతార అజిత్‌కు జంటగా విశ్వాసం, తెలుగులో చిరంజీవి సరసన సైరా నరసింహారెడ్డి చిత్రాల్లో న‌టిస్తుంది.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -