Friday, May 17, 2024
- Advertisement -

అతడితో టూర్ వెళ్లిన నయనతార.. ఈ లవ్ అయినా సక్సెస్ అవుతుందా?!

- Advertisement -

నయనతారకు ప్రేమ కథలు కొత్త కాదు. సినిమాల్లో ఎన్నో రకాల ప్రేమకథల్లో మునిగి తేలే ఆమె.. ఆఫ్ స్క్రీన్ లో కూడా విభిన్నమైన ప్రేమ అనుభవాలను ఎదుర్కొంది. మొదటగా శింబుతో. .ఆ తర్వాత ప్రభుదేవాతో..అందరి కళ్లలో పడేలా ప్రేమ కథలను నడిపింది నయనతార. శింబుతో లిప్ లాక్ లు తదితర రొమాన్స్ కూడా బయటపడిపోయింది.

ఇక ప్రభుతో పెళ్లే తరువాయి అనుకొన్నారంతా.  అయితే ఆ రెండు ప్రేమలూ విఫలం అయ్యాయి. ఇలాంటి నేపథ్యంలో ఆమె మూడో ప్రేమకథ రంజుగా సాగుతోంది.

ఈ సారి ఆమె ఒక తమిళ దర్శకుడితో ప్రేమయణాన్ని కొనసాగిస్తోంది. విగ్నేష్ అనే ఆ దర్శకుడితో నయన పీకలోతు ప్రేమలో ఉందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల  నయన, విగ్నేష్ ఒక విహారయాత్రకూ కూడా వెళ్లొచ్చారు. సమ్మర్ లో విదేశానికి వెళ్లి సేదతీరినట్టుగా తెలుస్తోంది. అయితే మనోడు అంత సక్సెస్ ఫుల్ దర్శకుడేమీ కాదు. మొదటగా నటుడిగా వచ్చి.. దర్శకుడిగా ట్రయల్స్ వేశాడు. అంతో ఇంతో గుర్తింపు సంపాదించుకొన్నాడు.

మరి ఇలాంటి నేపథ్యంలో వీరి ప్రేమ కథకు బాగా ప్రచారం వచ్చింది. ఈ విషయాన్ని నయన కూడా ఖండించడం లేదు. దీంతో ఈ ప్రేమ నిజమే అనుకోవాల్సి వస్తోంది. మరి ఈ కథ ఇకపై ఎలా సాగుతుందో.. నయనతార మూడో ప్రేమ కథ అయినా.. సఫలం అవుతోందా? అనేవి ఆసక్తికరమైన అంశాలు. ప్రస్తుతానికి అయితే నయన సినిమాలతో కూడా బిజీగా ఉంది. మరి ఆమె ఎప్పుడు ఈ లవ్ ఎఫైర్ గురించి నోరు విప్పుతుందో చూడాలి! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -