Sunday, May 19, 2024
- Advertisement -

వెంకయ్య నాయుడు.. పంచె విప్పడం వెనుక కథ అది!

- Advertisement -

భారతీయ జనతా పార్టీ నేత వెంకయ్య నాయుడు సహజమైన నెల్లూరు స్టైల్ లో కనిపిస్తాడు. జాతీయ రాజకీయాల్లో తన సత్తా చాటుతున్నా.. ఈయనలోని నెల్లూరిదనం ఎక్కడికీ పోలేదు.

దశాబ్దాలుగా నెల్లూరి స్టైల్ పంచెకట్టులోనేకనిపించడం ఈయన ప్రత్యేకత. మరి ఇలాంటాయన ఇప్పుడు మీడియాకు కొత్త లుక్ లో దర్శనమిస్తున్నాడు! పంచెవిప్పి… ప్యాంట్ లో కనిపిస్తున్నాడు.

మరి ఇప్పుడు ఉన్నట్టుండి ఈ మార్పు కనిపిస్తోంది. దశాబ్దాలుగా కనిపించిన స్టైల్ లో కాకుండా ఆయన కొత్త స్టైలోకనిపిస్తున్నాడు. ఢిల్లీలో అయినా.. గల్లీలో అయినా.. పంచెకట్టులో కనిపించే మనిషి డిఫరెంట్ గా ప్యాంటులో కనిపిస్తున్నాడు. మరి దీనికి రీజను ఏమిటి? అంటూ.. ఆయననే ఆరా తీస్తే. .అమెరికా పర్యటన అనే సమాధానం వినిపిస్తోంది.

త్వరలోనేవెంకయ్య అమెరికాలో పర్యటించనున్నాడు. అమెరికాలోని తెలుగు సంఘాలు ఈయనను ప్రత్యేకంగా ఆహ్వానించాయి. కేంద్రంలో చక్రం తిప్పే స్థాయిలో ఉన్న ఈయనను యూఎష్ లోని తెలుగు వారు ఇలా గౌరవించుకొంటున్నారు. మరి ఆ చలి దేశంలో పంచెతో తిరగడం కష్టం కదా! అందుకే వెంకయ్య అయినా అక్కడికి వెళితే పంచెవిప్పి ప్యాంట్ వేసుకోవాల్సిందే. మరి ఒక్కసారిగా అక్కడకు వెళ్లి ప్యాంట్ లో తిరగడం కష్టం. అందుకే ఆయన ఇక్కడే ప్యాంట్ వేశాడు. ప్యాంట్ తో నడవడం.. ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఇప్పటి నుంచినే దానికి అలవాటు పడటం ప్రారంభించాడు. అదీ వెంకయ్య పంచెవిప్పడం వెనుక కథ! 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -