Friday, May 17, 2024
- Advertisement -

వెంక‌య్య‌నాయుడు ఉప రాష్ట్ర‌ప‌తిగా వెల్ల‌డంతో బాబుకు ఎదురు దెబ్బ‌లు

- Advertisement -

ఏపీ సీంఎ చంద్ర‌బాబు నాయుడుకు 40 సంవ‌త్స‌రాల సుదీర్ఘ‌రాజ‌కీయ అనుభం. ఇటు రాష్ట్రం….అటు కేంద్రంలోను ఓవెలుగు వెలిగిన నేత‌. రాష్ట్ర‌ప‌తుల‌ను ఎంపిక‌చేయ‌డంలో కూడా ప్ర‌ధాన పాత్ర పోషించిన నాయ‌కుడు. ఎక్క‌డ స‌భ‌లు, స‌మావేశాలు జ‌రిగినా ఇవ‌న్నీ బాబు చెప్పుకోవ‌డం చాలాసార్లె చూశాం. అన్న రోజులు ఒకేలా ఉండ‌వు. ఒక్కో సారి ప‌రిస్థితులు తారుమారు అవుతుంటాయి. ఇదంతా ఇప్పుడు ఎందు క‌నుకుంట‌న్నారా….?

రాష్ట్ర విబ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత ఏపీలో భాజాపా-టీడీపీ పొత్తు పెట్టుకొని అధికారంలోకి వ‌చ్చింది టీడీపీ. ఇటు రాష్ట్రంలోను…అటు కేంద్రంలోను మంత్రి వ‌ర్గంలో కూడా భాగ‌స్వాములు కూడా ఉన్నారు. పొత్తుల విష‌యంలో వెంక‌య్య‌నాయుడు కీల‌క పాత్ర పోషించారు.

ప్ర‌ధానిగా న‌రేంద్ర మోదీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత బాబును దూరంగా ఉంచ‌డం మొద‌లు పెట్టారు. కేంద్రంనుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధుల విష‌యంలోకూడా వెంక‌య్య‌నాయుడు ప్ర‌ముఖ పాత్ర పోషించారు. చంద్ర‌బాబును మోదీ దూరంగా ఉంచ‌డం ఎన్నో సార్లు స్ప‌ష్టంగా క‌న‌ప‌డుతున్నా కేంద్రమంత్రిగా వెంకయ్య ఉన్న కారణంగా చంద్రబాబు ఏదోలా నెట్టుకొచ్చే వారు. ఎప్పుడైతే వెంకయ్యను మోడి ఉపరాష్ట్రపతిగా ఎంపిక చేశారో అప్పటి నుండే చంద్రబాబుకు సమస్యలు మొదలయ్యాయి.

మొద‌టి నుంచి బాబంటె మోదీకి ఇష్టంలేద‌నె చెప్పాలి. వెంక‌య్య‌నాయుడి కారంగానె ఏదో అంటీ ముట్ట‌న‌ట్లుగా ఉన్నారు. దీంతో వెంక‌య్య‌నాయుడు మంత్రిగా ఉన్నంత వ‌ర‌కు బాబు త‌ల‌నొప్పి త‌గ్గ‌ద‌ని మోదీ… వెంక‌య్య‌ను ఉప‌రాష్ట్ర‌ప‌తిగా పంపించారు. ఉప‌రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి వెంక‌య్య‌కు ఇష్టం లేకున్నా మోడికి ఎదురు చెప్ప‌లేక ఉపరాష్ట్రపతిగా వెంకయ్య బాధ్యతలు తీసుకోక తప్పలేదు.

విభజన చట్టం ప్రకారం రాష్ట్రప్రయోజనాలను కేంద్రం పట్టించుకోకపోయినా వెంకయ్య, చంద్రబాబులకు చీమ కుట్టినట్లు కూడా అనిపించలేదు. ఏ విషయంలో కూడా కేంద్రాన్ని నిలదీయలేని స్దితిలో చంద్రబాబు కూరుకుపోయారు. దాదాపు సంవ‌త్స‌రంగా ప్ర‌ధాని మోదీ అపాయంట్ మెంట్ ఇవ్వ‌డంలేదంటె బాబుకు ఎలాంటి గ‌డ్డు ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయో అర్థ‌మ‌వుతుంది. ఇక పోవ‌రం విష‌యంలోకూడా బాబు ఆట‌లు సాగ‌డంలేదు. క‌నీసం చివ‌ర‌కు త‌న న‌మ్మ‌క‌స్తుడైన ఐపిఎస్ అధికారిని కూడా చంద్రబాబు డిజిపిగా ఎంపిక చేయించుకోలేని దుర్భ‌ల ప‌రిస్థితుల్లో ఉన్నారు.

ఇదంతా చంద్ర‌బాబు స్వ‌యంకృతాప‌రాధ‌మే. దాదాపు ఏడాదిన్నర కాలంగా సాంబశివరావును డిజిపి ఇన్ చార్జిగా ఉంచి ఉద్యోగ విరమణ చేసే ముందు పూర్తి కాలం డిజిపిగా నియమించాలని సిఫారసు చేస్తే కేంద్రం ఎందుకు ఒప్పుకుంటుంది? ఏడాదిన్న ర క్రితమే సాంబశివరావును పూర్తి స్దాయి డిజిపిగా ఎందుకు నియమించలేదన్న ప్రశ్నకు చంద్రబాబు నుండి సామధానం లేదు.

విభజన చట్టాన్ని తుంగలో తొక్కటం కావచ్చు, పోలవరంకు నిధులు మంజూరు విషయం, పోలవరం కాంట్రాక్టర్ ను మార్చే అంశం, రాజధానికి నిధుల కేటాయింపు, తాజాగా డిజిపి వ్యవహారం కావచ్చు. విషయమేదైనా సరే చంద్రబాబుకు కేంద్రం వద్ద ఎదురు దెబ్బలే తగులుతున్న విషయం వాస్తవం. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో భాజాపా ఒంట‌రిగా పోటీ చేస్తె బాబు ప‌రిస్థితి ఎలా ఉంటుందో.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -