Friday, May 3, 2024
- Advertisement -

ముఖ్య‌మంత్రిగా త్వ‌ర‌లో న‌య‌న్‌ను చూడ‌బోతున్నామా…?

- Advertisement -

జయాపజయాలతో సంబంధం లేకుండా సౌత్ ఇండస్ట్రీలో గత కొన్నేళ్లుగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న బ్యూటీ నయనతార. అమ్మడు ఎలాంటి సినిమాలు చేసిన మినిమమ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతో కొంత ప్రభావం చూపుతాయి. ఇక లేడి ఓరియెంటెడ్ సినిమాలు కూడా చాలా వరకు నయనతారకు కలిసొస్తున్నాయి.

ఇక న‌య‌న‌తార‌కు ఉన్న ల‌వ్ ఎఫైర్స్ చెప్పాల్సిన ప‌నిలేదు. ప్రస్తుతం కోలీవుడ్ లో నయనకు సంబందించిన ఒక న్యూస్ వైరల్ గా మారింది. ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి బలమైన కారణముందని కోలీవుడ్ మీడియా ఇష్టం ఉన్నట్టుగా కథనాలను ప్రచారం చేస్తోంది. జయలలిత లానే ముఖ్యమంత్రి కావాలని నయనతార పెళ్లి చేసుకోలేదని చెబుతున్నారు.

తమిళ్ దర్శకుడు జీటీ.నందు ఈ న్యూస్ రావడానికి మొదటి కారణమయ్యాడు. నయనతారకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని దర్శకుడు జీటీ నందు వెల్లడించారు. నయనతారల ప్రేమ వ్యవహారం, ఆ తర్వాత వారు విడిపోవడంపై పలు కారణాలు ప్రచారంలో ఉన్నాయని… తనకు తెలిసిన ఓ కారణం కరెక్ట్ అయి ఉండవచ్చని ఆయన చెప్పారు.

చాలా కాలం ముందు తాను, శింబు తరపున మరో వ్యక్తి ఒక జ్యోతిష్కుడిని కలిశామని… శింబు, నయన్ ల జాతకాలను సదరు జ్యోతిష్కుడు పరిశీలించారని తెలిపారు. నయనతారకు వివాహం అయితే ఆమె నడి రోడ్డున పడే అవకాశం ఉందని… పెళ్లి చేసుకోకపోతే ఆమె ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని జ్యోతిష్కుడు చెప్పారని అన్నారు. నయన్ పెళ్లి చేసుకోకపోవడానికి ఇదే సరైన కారణం అయి ఉండవచ్చని తెలిపారు. మ‌రి ఇందులో ఎంత నిజం ఉందో న‌య‌న్‌కే తెలియాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -