Sunday, May 12, 2024
- Advertisement -

రెండో రోజు ఆట‌ముగిసే స‌మ‌యానికి ప‌టిష్ట‌ స్థితిలో భార‌త్‌

- Advertisement -

హైదరాబాద్ లో జరుగుతున్న సెకండ్ టెస్ట్ లో రెండో రోజు ఆట ముగిసింది. మొదటి రోజు భారత బౌలర్లు విజృంభించగా, రెండో రోజు భారత బ్యాట్ మెన్స్ ఆ పని చేస్తున్నారు. ఆట ముగిసే స‌మయానికి వికెట్ ప‌డ‌కుండా 4 వికెట్ల‌కు 308 ప‌రుగులు చేసి ప‌టిష్ట‌స్థితిలో ఉంది.

ఆరంభంలో పృథ్వీషా, ఆ తర్వాత విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా వీరిద్దరూ అవుటైన తర్వాత అజింకా రెహానె, రిషబ్ పంత్… బాధ్యతయుత ఇన్నింగ్స్‌తో భారీ స్కోర్‌కి బాటలు వేశారు. రాజ్‌టెస్ట్‌లో అద్భుత శతకంతో రికార్డులు క్రియేట్ చేసిన పృథ్వీషా… ఉప్పల్‌లోనూ అదే దూకుడు కొనసాగించాడు. రహానే 75 పరుగులు 175 బంతుల్లో, రిషబ్ పంత్ 85 పరుగులు 120 బంతుల్లో సాధించి సెంచరీ దిశగా సాగుతున్నారు.

తొలి ఓవర్ నుంచే ఫోర్లతో ప్రత్యర్థి జట్టుపై విరుచుకుపడిన పృథ్వీషా… మొదటి ఓవర్‌లోనే ఓ ఫోర్, ఓ సిక్సర్‌తో మొత్తంగా 15 పరుగులు రాబట్టాడు. ఓ వైపు కెఎల్ రాహుల్ నెమ్మదిగా ఆడుతూ పరుగులు రాబడుతుంటే… పృథ్వీషా పరుగుల సునామీ సృష్టించాడు. జట్టు 61 పరుగుల వద్ద రాహుల్ అవుటయ్యాడు. మొదటి టెస్ట్‌లో డకౌట్ అయిన రాహుల్, రెండో టెస్ట్‌లోనూ కేవలం 4 పరుగులు చేసి అవుటవ్వడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -