Wednesday, May 22, 2024
- Advertisement -

కోహ్లీ, రోహిత్ మధ్య విబేధాలకు మరో సాక్షం…

- Advertisement -

వరల్డ్ కప్ ఓటమి నేపథ్యంలో టీమిండియా ఆటగాళ్లలో రెండు గ్రూపులు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా, కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్ శర్మల మధ్య విభేదాలు నెలకొన్నాయని కథనాలు వచ్చాయి. వీరి మధ్య విబేధాలు లేవని బీసీసీఐ, కోహ్లీ క్లారిటీ ఇచ్చిన వీరిమధ్య విబేధాలు ఉన్నాయనేదానికి మరో సాక్షం బయటపడింది. కోహ్లీ చేసిన ఓ పోస్ట్ ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. ఇటీవలే రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ఓ ఫొటో పెట్టి జట్టు కోసం కాదు, ప్రతిసారి దేశం కోసమే బరిలో దిగుతాను అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు.

ప్రపంచకప్‌లో భారత్ తుది జట్టు ఎంపిక, సెమీస్‌లో ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌ మార్పు నిర్ణయాల్ని వైస్ కెప్టెన్‌ హోదాలో ఉన్న తనని కనీసం సంప్రదించకుండా కెప్టెన్ కోహ్లీ ఏకపక్షంగా తీసుకున్నాడని రోహిత్ శర్మ గుర్రుగా ఉన్నాడు. టీమిండియాతో కలసి ఇండియాకు రాకుండా సొంత ఖర్చులతో నాలుగు రోజులు ముందుగానే రోహిత్ శర్మ ఇంగ్లాండ్ నుంచి భారత్‌కి వచ్చేశాడు. దీంతో వారి మధ్య విబేధాలు బయటపడ్డాయి.

కోహ్లీ చేసిన మూడు రోజుల క్రిందల చేసిన రెండు పోస్టుల్లో రోహిత్ లేడు. తాజాగా ఈరోజు జడేజా, నవదీప్ షైనీ, ఖలీల్ అహ్మద్, శ్రేయాస్ అయ్యర్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, కేఎల్ రాహుల్‌తో దిగిన ఫొటోని కోహ్లీ షేర్ చేస్తూ ‘స్క్వాడ్ 100’ అంటూ రాసుకొచ్చాడు. దీంతో.. రోహిత్ శర్మ లేకుండా టీమ్‌ ఎలా పరిపూర్ణమవుతుందంటూ అభిమానులు కోహ్లీని ప్రశ్నిస్తున్నారు. వివాదాలకు పుల్ స్టాప్ పెట్టకుండా ఇద్దరూ ఇద్దరి మధ్య ఉన్న విబేధాలను బయటపపెట్టుకుంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -