Thursday, April 25, 2024
- Advertisement -

సాగర తీరాన ‘చిరుత’ బ్యూటీ హల్ చల్!

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ‘చిరుత’ చిత్రం వచ్చింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ నటించింది. తెలుగు లో తర్వాత ఏ చిత్రంలోనూ నటించలేదు. చిరుత సినిమాలో త‌న న‌ట‌న‌తో కుర్ర‌కారును హుషారెత్తించింది బాఘ‌ల్ పూర్ భామ తర్వాత బాలీవుడ్ లో నటించినా పెద్దగా అవకాశాలు దక్కించుకోలేదు. కాకపోతే సోషల్ మీడియాలో మాత్రం తెగ హల్ చల్ చేస్తుంది.

తన అందాల ఆరబోతతో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఇటీవ‌లే ఈ భామ ఫ్లోరిడా బీచ్ లో స‌ర‌దాగా చ‌క్క‌ర్లు కొట్టిన వీడియో నెట్టింట్లో వైర‌ల్ అయింది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ పార్టీవేర్ డ్రెస్ లో సాగ‌ర‌తీరంలోని విల్లాలో ఫొటోలు దిగింది. చెల్లెలు ఐషా శ‌ర్మతో సెల్ఫీ దిగి.. ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.

ఈ బ్యూటీ కొన్ని రోజులుగా త‌న సోద‌రి ఐషా శ‌ర్మ‌తో క‌లిసి ఫ్లోరిడాలో స‌ర‌దా స‌మ‌యాన్ని గ‌డుపుతోంది‌. ఈ సుంద‌రి ప్ర‌స్తుతం ఓ పంజాబీ చిత్రంలో న‌టిస్తోంది. మరి తన అందాల ఆరబోత ఏ దర్శకుడిని ఆకట్టుకోవడానికో తెలియాాలి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -