నేనింతే శియా గౌతమ్ లేడి ఓరియంటెడ్ సినిమా !!!

'Neninthe' Fame Siya Gautam Female Centric Film titled 'Maro Mahabharatham'
'Neninthe' Fame Siya Gautam Female Centric Film titled 'Maro Mahabharatham'

కెఎల్ఎన్ క్రియేషన్స్ క్రియేటివ్ క్యారెక్టర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా తెరకెక్కుతున్న సినిమాలో నేనింతే సినిమా హీరోయిన్ శీయా గౌతమ్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాకు మరో మహా భారతం టైటిల్ ను ఖరారు చేశారు. లేడీ ఓరియంటెడ్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ దసరా రోజున పూజా కార్యక్రమాలతో ప్రారంభం కానుంది.

జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీకి లక్ష్మీ నారాయణ కిల్లి మరియు రామకృష్ణ నిర్మిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారం నుండి ప్రారంభం కానుంది. అక్టోబర్ 5న ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల కానుంది.

Also Read : గాడ్ ఫాదర్ పై చిరు కు నమ్మకం లేదా ?