Friday, March 29, 2024
- Advertisement -

Jr.NTR : స్పందిస్తే ఇలా.. స్పందించకపోతే అలా.. ఏంటి గురూ ఇది !

- Advertisement -

ప్రస్తుతం ఏపీలో జూ. ఎన్టీఆర్ చుట్టూ రాజకీయ వేడి తారస్థాయిలో కొనసాగుతోంది. ఇటీవల ఏపీ ప్రభుత్వం ” ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ” ని వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. దివంగత ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్‌టి రామారావు ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు తీసి వైఎస్ఆర్ పేరు ఎలా పెడతారని అన్నీ వైపులా జగన్ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక టిడిపి శ్రేణులైతే ఏపీ ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిరసనల బాటా పట్టారు. అయితే జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సామాన్యులు కూడా తప్పుబడుతున్నారు. అంతే కాకుండా వైసీపీలోని చాలా మందిలో కూడా జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అసంతృప్తిగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల కూడా జగన్ నిర్ణయాన్ని గట్టిగానే వ్యతిరేకించారు. .

ఇంతవరకు బాగానే ఉన్నప్పటికి.. స్వర్గీయ ఎన్.టి రామారావు ను ఆరాధ్య దైవంగా భావించే ఆయన మనవడు జూ. ఎన్టీఆర్ ఈ అంశంపై ఎలా స్పందిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అయితే తారక్ వేదాంత ధోరణిలో ” NTR, YSR ఇద్దరు విశేష ప్రజాదరణ కలిగిన గొప్ప నాయకులనలు, ఈ రకంగా ఒకరి పేరు తీసి మరొకరి పేరు పెట్టడం వల్ల YSR స్థాయి పెంచదు, NTR స్థాయిని తగ్గించదు, విశ్వ విద్యాలయానికి పేరు మార్చడం ద్వారా NTR, తెలుగు ప్రజల్లో సంపాధించుకున్న కీర్తి ఎప్పటికీ చెరిగిపోదు.” అంటూ జూ. ఎన్టీఆర్ ట్వీట్ చేశాడు. అయితే జూనియర్ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గట్టిగానే వస్తున్నాయి.

తెలుగు జాతి ఖ్యాతి పెంచిన ఎన్.టి రామారావు పేరుకు అవమానం జరిగే విధంగా జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంటే.. ఆయనను ఆరాధ్య దైవంగా కొలిచే ఆయన మనవడు జూ. ఎన్టీఆర్ ఇంత సానుకూలంగా స్పందించారెంటి.. అని టీడీపీ శ్రేణులు జూ.ఎన్టీఆర్ వ్యాఖ్యలను తప్పుబడుతున్నారు. ఇక ఆ మద్య చంద్రబాబు సతీమణిని పట్ల అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయంలో కూడా జూ. ఎన్టీఆర్ ఆచితూచి స్పందించారు. అప్పుడు కూడా ఎన్టీఆర్ స్పందించిన తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశారు టీడీపీ శ్రేణులు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజకీయాల్లో లేరు. ఆయన నందమూరి కుటుంబ వారసుడిగా సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. అయితే తాన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి అవసరమైతే అన్నీ విధాలుగా అండగా ఉంటానని గతంలో తారక్ చెప్పిన సంగతి విధితమే. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో టీడీపీ పరిస్థితి చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. దాంతో తారక్ రాజకీయాల్లోకి రావాలని, టీడీపీకి పూర్వ వైభవం తీసుకు రావాలని టీడీపీలో ఓ వర్గం నుంచి గట్టిగానే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తారక్ ఎలాంటి వ్యాఖ్యలు చేసిన పోలిటికల్ గా తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. అందుకే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ అంశం తెరపైకి వచ్చిన తారక్ స్పందన ఎలా ఉంటుందా ? అని రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతుంటాయి. అయితే తారక్ స్పందించకపోతే ఎందుకు స్పందించడం లేదు అని విమర్శలు ఎదురవడం సహజం. అలాగే తారక్ ఆచితూచి స్పందితే.. ఇలా స్పందించారెంటి ? అంతే స్థాయిలో విమర్శలు చేస్తారు. ఒకవేళ జగన్ సర్కార్ పై జూ, ఎన్టీఆర్ కాస్త ఘాటుగా స్పందిస్తే.. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాబోతున్నాడనే వార్తలు జోరుగా ఊపందుకుంటాయి. దాంతో ఎన్టీఆర్ చేసే ప్రతి వ్యాఖ్యలు కూడా ఆచితూచి చేస్తున్నాడని తారక్ అభిమానులు చెబుతున్నా మాట. ఏది ఏమనప్పటికి టీడీపీకి సంబంధించిన ప్రతి అంశం కూడా ఎన్టీఆర్ ను ఇరకాటంలో పెట్టె విధంగానే ఉందనేది ఎవరు కాదనలేని వాస్తవం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -