Saturday, April 27, 2024
- Advertisement -

గాడ్ ఫాదర్ పై చిరు కు నమ్మకం లేదా ?

- Advertisement -

టాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన నుంచి సినిమా వస్తుందంటే నెల రోజుల ముందు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద పండగ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. ఇక మెగా స్టార్ అభిమానులు చేసే హంగామా ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో మెగాస్టార్ అభిమానుల ఉత్సాహాన్ని మరింత పెంచే విధంగా మేకర్స్ సినిమాను చాలా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. నెల రోజుల ముందు నుంచే మూవీకి సంబంధించిన పాటలతోనూ, ఇంటర్వ్యూ లతోనూ మీడియా ను హోరెత్తిస్తుంటారు మేకర్స్.

అయితే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ విషయంలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా జరుగుతోంది. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5 న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా మరో రెండు వారాల్లో రిలీజ్ కాబోతున్నప్పటికి ఇప్పటివరకు మూవీకి సంబంధించి ఎలాంటి పబ్లిసిటీ చేయడం లేదు చిత్రయూనిట్. మెగాస్టార్ కూడా ఈ సినిమా పబ్లిసిటీ విషయంలో పెద్దగా ఆసక్తి కనబరచడం లేదని ఇన్ సైడ్ టాక్. అంతే కాకుండా మూవీని కొనుగోలు చేసే విషయంలో డిస్ట్రిబ్యూటర్స్ కూడా వెనుకడుగు వేస్తున్నారట. దాంతో సినిమాకు రావలసిన హైప్ రావడం లేదని సినీ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి.

ఇక ఈ మలయాళ మూవీ అయిన ” లూసిఫర్ ” మూవికి రీమేక్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీ తెలుగులో కూడా డబ్ అయింది అయినప్పటికి కంటెంట్ మీద ఉన్న నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవి ” లూసిఫర్ ” ను రీమేక్ చేసేందుకు మొగ్గు చూపారు. అయితే సినిమా కంప్లీట్ అయిన తరువాత అవుట్ పుట్ విషయంలో మెగాస్టార్ కాస్త నిరాశగా ఉన్నారని సమాచారం. అందుకే ఈ సినిమాకు పబ్లిసిటీ విషయంలో చిరు పెదవి విరుస్తున్నారని సినీ సర్కిల్స్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. .

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -