Friday, March 29, 2024
- Advertisement -

‘నేను c/o నువ్వు’ సినిమా రివ్యూ

- Advertisement -

లవ్ & ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు సెప్టెంబర్ 30 న గ్రాండ్ గా విడుదలైన సినిమా ’ నేను c/o నువ్వు ’. ఈ సినిమా ఆగాపే అకాడమీ పతాకంపై రత్న కిషోర్,సన్య సిన్హా, సత్య,ధన, గౌతమ్ రాజ్ నటీ,నటులుగా సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వం వహించారు. అత్తావలి , శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె.జోషఫ్ లు  ఈ సినిమాకి సహ నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన మోషన్  పోస్టర్‌, టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకులనుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ సినిమా థియేటర్ లో ప్రేక్షకులను ఏ మాత్రం ఎంటర్టైన్ చేసిందో ఇప్పుడు చూద్దాం.

కథ: 1980 లో జరిగిన కథ ఇది. పల్లెటూరులో పేదింటి అబ్బాయి. ఉన్నత స్థితిలో ఉన్న అమ్మాయి మధ్య జరిగిన ఒక యదార్ధ సంఘటన ఆధారంగా తెరకెక్కిన కథ ఇది.గోపాలపురం అనే ఊరికి ప్రతాప్ రెడ్డి అనే వ్యక్తి ప్రెసిడెంట్ గా ఉన్న టైమ్ లో కులాల మధ్య విపరీతమైన వర్గపోరు నడుస్తూ ఆధిపత్య పోరులో నలిగిపోతూ ఉంటున్న ఆ ఊరిలో ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన మారుతి (రత్న కిషోర్) ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి చెల్లెలు దీపిక (సన్య సిన్హా) ను గుడిలో చూసిన మొదటి చూపులోనే ప్రేమిస్తాడు. అయితే ప్రెసిడెంట్ ప్రతాప్ రెడ్డి మాత్రం తన కులం అమ్మాయిలను ప్రేమించినా.. ప్రేమిస్తున్నానని వెంట పడినా..రాజకీయంగా ఎదగాలని చూసినా వారిని చంపేస్తుంటాడు. రోజూ దీపిక వెంట పడుతున్న మారుతీని మొదట దీపిక పట్టించుకోక పోయినా.. ఎగ్జామ్స్ టైమ్ లో మారుతి చేసిన హెల్ప్ తో ఇష్టపడుతుంది. ఒకానొక సందర్బంలో దీపిక చేతిని మారుతి పట్టుకోవడం చూసిన ప్రతాప్ రెడ్డి తక్కువ కులపోడని మారుతిని చితగ్గొడతాడు. ఆ తర్వాత దీపిక మారుతి పై మరింత ప్రేమను పెంచుకుంటుంది. దీంతో ప్రతాప్ రెడ్డి తన కులం అబ్బాయి కార్తీక్ తో పెళ్లి ఫిక్స్ చేస్తాడు.ఆ తరువాత జరిగిన సంఘటనలు ఆ ఊరిని ఎటువైపు తీసుకెళ్లాయి.వీరిద్దరి ప్రేమకథ ఎటువైపుకు దారి తీసింది, దీపిక ఇష్టపడే విదంగా మారుతి ఎం హెల్ప్ చేశాడు? కార్తీక్ తో దీపికకు పెళ్లి జరిగిందా ? లేక ప్రతాప్ రెడ్డి ని ఎదిరించి దీపిక, మారుతిలు పెళ్లి కున్నారా? లేదా? అనేది తెలుసుకువాలంటే ‘నేను c/o నువ్వు’’ సినిమా కచ్చితంగా చూడాల్సిందే..

నటీనటుల పనితీరు: రత్న కిషోర్ కొత్తవాడైనా తన పరిధిలో చాలా చక్కగా నటించాడు . సన్య సిన్హా తన నటనతో ఆకట్టుకుంది. గౌతమ్ రాజ్, ధనరాజ్ లు కీలక పాత్రలలో నటించారు.మారుతి కి ఫ్రెండ్స్ గా నటించిన సత్య, రాధాకృష్ణ , బాషా తదితరులు అందరూ చాలా చక్కగా నటించారు. దర్శకుడిగా, నటుడుగా సాగారెడ్డి తుమ్మ ప్రతాప్ రెడ్డి పాత్రలో చక్కటి విలనిజం చూయించాడు.చెల్లెలు దీపికను ప్రేమగా చూసుకొనే అన్నయ్యగా అద్భుతంగా నటించాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ కి ఒక కొత్త విలన్ వచ్చాడా అని అబ్బుర పరచే విధంగా అతని యొక్క నటన ప్రతిభ పాఠవాలు ఉన్నాయి.ఇంకా ఇందులో నటించిన వారంతా వారికిచ్చిన పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక నిపుణుల పని తీరు: చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ ఈ చిత్రానికి సున్నితమైన పదజాలంతో కఠినమైన వాస్తవాలను ప్రతిబింభించేలా విభిన్న మైన కోణంలో, విభిన్న మైన స్క్రీన్ ప్లే తో, దర్శకత్వం అన్నీ తన బుజాలమీద వేసుకుని కులం పేరుతో పరువు హత్యలు వంటి మంచి కథను సెలెక్ట్ చేసుకొని చాలా చక్కగా జనరంజికంగా చిత్రీకరించడం జరిగింది. ఎన్.ఆర్.రఘునందన్ గారు అందించిన సంగీతం సినిమాకు ప్లస్ అవుతుంది. ఇందులో ఉన్న ఒక్క క్షణం.. లోన చేరే.. ఒక్క సా..రి జీవితమూ.. పాట, హే బేబీ మై బేబీ పాట, లుక్ అట్ మై హార్ట్ పాట, ప్రేమను లోకంలో కుడి కాలే మోపాను వంటి నాలుగు పాటలు కూడా సందర్భాను సారం వస్తాయి. డి ఓ పి జి.కృష్ణ ప్రసాద్ తీసిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ పని తీరు బాగుంది. ఫైట్స్ బాగా ఉన్నాయి.ఈ చిత్రం చూస్తుంటే టెక్నిసియన్స్ హార్డ్ వర్క్ కనిపిస్తుంది.ఆగాపే అకాడమీ పతాకంపై సాగారెడ్డి తుమ్మ స్వీయ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రానికి అత్తావలి, శేషిరెడ్డి, దుర్గేష్ రెడ్డి, కె .జోషఫ్ లు  సహ నిర్మాతలు అందరూ కలసి ఖర్చుకు వెనుకాడకుండా చాలా చక్కగా నిర్మించారు.మనం ఈ మధ్య కులం పేరుతో పరువు హత్యలు చూస్తున్నాము అలాంటి మంచి కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన “నేను c/o నువ్వు’’ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది.

హైలెట్స్ : దర్శకుడు చక్కటి కథను ఎన్నుకొని చాలా బాగా తెరాకెక్కించాడు..ప్రెసిడెంట్ పాత్రలో చిత్ర దర్శకుడు సాగా రెడ్డి తుమ్మ ఈ చిత్రం ద్వారా సరికొత్త విలనిజం చూపించాడు. తెలుగు ఇండస్ట్రీ కి మరో కొత్త విలన్ వచ్చాడు అనేలా అద్భుతమైన పెర్ఫార్మన్స్ చేశాడు.సినిమాకు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.కెమెరామెన్ అందించిన విజువల్స్ చాలా రిచ్ గా ఉన్నాయి. హీరోయిన్ సినిమాలో చూడడానికి సైలెంట్ గా ఉన్నా చాలా చక్కటి పెర్ఫార్మన్స్ కనపరచింది.

మైనస్ లు : ఇందులో హీరో ఉన్నంతలో బాగా చేశాడు. కానీ ఆ పాత్రకు ఎవరైనా ఎలివెటెడ్ ఆర్టిస్ట్ ఉండి ఇంకా మంచి ఆర్టిస్టులు నటించి ఉంటే మరో RX100 సినిమా అయ్యేది. పెద్ద ఆర్టిస్టులు లేకపోవడం కొంత డ్రా బ్యాక్ అని చెప్పవచ్చు.

రివ్యూ రేటింగ్ : 3/5

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -