Friday, April 26, 2024
- Advertisement -

టుడే స్పెషల్ : అక్టోబర్ 1న.. ఇన్ని ప్రత్యేకతలున్నాయా ?

- Advertisement -

చరిత్రలో ప్రతిరోజూకి ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఆ విధంగా అక్టోబర్ ఒకటిన కూడా చాలా ప్రత్యేకతలే ఉన్నాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం !

మనదేశ చరిత్రలో గొప్ప సంఘ సంస్కర్తగా పేరుపొందిన రఘుపతి వెంకటరత్నం నాయుడు పుట్టిన రోజు నేడు. ఆయన 1862 అక్టోబర్ 1 న ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నంలో జన్మించారు. ఈయన పునరుజ్జీవనోద్యమ పితామహుడుగా పేరుపొందిన కందుకూరి వీరేశలింగం వద్ద శిష్యరికం కూడ చేశారు. రఘుపతి వెంకటరత్నం అంటరాని తనాన్ని నిర్మూలించేందుకు.. చేసిన పోరాటం అనిర్వచనీయం. .

అలాగే ” దేవదాసీ వ్యవస్థ ( దేవాలయాలకు అంకితం చేసిన మహిళలు.. కాలక్రమేణ వ్యబిచారీణులు గా పరిగణించబడే వ్యవస్థ ) ” పూర్తిగా నిర్మూలించడంలో రఘుపతి వెంకటరత్నం విజయం సాధించారు. అంతే కాకుండా వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించడం.. స్త్రీ విధ్యను ప్రోత్సహించడం వంటివి చేశారు. అందుకే ఆయనను “బ్రహ్మర్షి ” అని కూడా పిలుస్తారు. ఇక అక్టోబర్ 1న ఉన్న మరో ప్రత్యేకత ఏంటో తెలుసా.. మద్రాస్ రాష్ట్రంలో అంతర్లీనంగా ఉన్న ఆంధ్రరాష్ట్రం 1953 అక్టోబర్ 1 న విడిపోయింది.

అక్టోబర్ 1 కి ఉన్న మరికొన్ని ప్రత్యేకతలు..
* నేడు ప్రపంచ శాఖాహార దినోత్సవంగా జరుపుకుంటారు.
* కాఫీ ప్రియుల కోసం ప్రత్యేకంగా నేడు ” ప్రపంచ కాఫీ దినోత్సవంగా జరుపుకుంటారు.
* అలాగే నేడు అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం కూడా.

ఇక నేటి నుంచి దేశంలో 5జి సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రధాని నరేంద్ర మోడి డిల్లీలోని ప్రగతి మైదాన్ వేదికగా ఈ సేవలను ప్రారంభించనున్నారు. మొదట 13 నగరాలలో ఈ 5జి నెట్వర్క్ రోల్ అవుట్ అవుతుందని సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -