Wednesday, May 1, 2024
- Advertisement -

‘నేను లోకల్’ మూవీ రివ్యూ!

- Advertisement -
nenu local movie review in telugu

వరస సూపర్ హిట్స్ తో యంగ్ హీరోల్లో ముందు వరసలో ఉన్నాడు నాని. తాజాగా నాని చేసిన సినిమా ‘నేను లోకల్’. త్రినాథ రావ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని దిల్ రాజు నిర్మించారు. మొదటి నుంచి ఈ చిత్రంపై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి.

అందులోను ఈ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ నటిస్తుండటంతో ఈ హైప్ మరింత పెరిగింది. మరి ఇన్ని అంచనాలతో ఈ రోజు రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం.. 

కథ :

బీటెక్ కుర్రాడు (నాని) అతి కష్టం మీద ఇంజనీరింగ్ పాస్ అవుతాడు. ఆ తర్వాత ఏం చేయాలో అని ఆలోచిస్తున్న టైంలో కీర్తి (కీర్తి సురేష్) ని చూసి లవ్ లో పడతాడు. ఆమె కూడా తనను ప్రేమించేలా చేస్తాడు. కానీ ఆమె నాన్న మాత్రం వీళ్ళ ప్రేమకు ఒప్పుకోడు. అదే సమయంలో బాబు ప్రేమకు మరో అనుకోని అవాంతరం ఎదురవుతుంది. ఆ అనుకోని అవాంతరం ఏమిటి ? బాబు దాన్ని ఎలా ఫేస్ చేశాడు ? చివరికి కీర్తి నాన్నను ఒప్పించాడా లేదా ? అసలు నాని యాటిట్యూడ్ ఎలా ఉంటుంది ? అనేదే తెరపై నడిచే సినిమా.

ప్లస్ పాయింట్స్ :

ముఖ్యంగా ఈ సినిమాలో నాని నటన అద్భుతం అని చెప్పాలి. ఎప్పుడూ చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తూ అన్నింటినీ లైట్ గా తీసుకుని తాను అనుకున్నదే చేసే కుర్రాడు బాబు పాత్ర బాగుంది. నాని చేసిన ప్రతి సన్నివేశం చూడటానికి చాలా బాగుంది. ఇక ఫస్టాప్ సినిమా మొత్తం నాని చూట్టు తిరుగుతూ.. సరదా సీన్స్‌తో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయింది. సినిమాలో కీలకమైన ఇంటర్వెల్ ట్విస్ట్ కూడా బలంగా ఉండి సెకండాఫ్ మీద ఆసక్తిని పెంచింది. ఇక సెకండాఫ్ లో వచ్చే పోలీస్ స్టేషన్ సీన్, నిశ్చితార్థం సీన్ బాగున్నాయి. ఇక ఈ సినిమాకి మరో ప్రధాన బలం కీర్తి సురేష్ నటన. అందంగా కనిపిస్తూనే అద్భుతమైన నటనను ప్రదర్శించి సినిమాలో రొమాంటిక్ ఫీల్ ని ఎక్కడా తగ్గకుండా నిలబెట్టింది. ఇద్దరు ప్రతిభ ఉన్న నటులు కలిసి నటిస్తే ఎంత చూడ చక్కగా ఉంటుందో నాని – కీర్తి సురేష్ ల జంట అలానే ఉంది. అలాగే ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ లో వచ్చే ఎమోషన్ సన్నివేశం కాస్త పర్వాలేదనిపించింది. దేవి శ్రీ పాటలు, వాటికి త్రినాథరావు నక్కిన టేకింగ్, సినిమాటోగ్రఫీ చాలా బాగా కుదిరి అందంగా తయారయ్యాయి. కీలకమైన నవీన్ చంద్ర పాత్ర, నాని తండ్రి స్థానంలో పోసాని కృష్ణ మురళి నటన, హీరోయిన్ తండ్రిగా సచిన్ ఖేడేకర్ పెర్ఫార్మెన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్ :

మైనస్ పాయింట్స్ విషయంకు వస్తే ముందుగా చెప్పాల్సింది సినిమా స్టోరీ గురించి. అన్ని పాత చిత్రాల్లాగే ఈ సినిమా కథ కూడా రొటీన్ గానే ఉంటుంది. కొత్తదనం పెద్దగా లేదని చెప్పాలి. కొన్ని సీన్స్ రన్ టైం పెంచడం కోసం తీసినట్టు అనిపించింది. ఫస్టాప్ తో పోలిస్తే సెకండాఫ్ కాస్త బోర్ గా సాగింది. చాలా సీన్స్‌లను ముందుగానే ఊహించవచ్చు. క్లైమాక్స్ ఎపిసోడ్ ఎమోషన్ కలిగి కాస్త పర్వాలేదనిపించినా దాని ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ మాత్రం మరీ సాగదీసినట్టు ఉండటం వల్ల సినిమాపై ఆసక్తి తగ్గించి అని చెప్పాలి.

మొత్తంగా :

హీరో క్యారెక్టరైజేషనే అద్భుతంగా తెరకెక్కిన  ఈ ‘నేను లోకల్’ సినిమా నాని మార్క్ సినిమాలను కోరుకునే వాళ్లకు, ఎంటర్టైన్మెంట్ ఆశించే వాళ్లకు, ముఖ్యంగా యువతకు నచ్చుతుంది. నాని.. నటన, కీర్తి సురేష్ పెర్ఫార్మన్స్, సరదాగా సాగిపోయే ఫస్టాఫ్, మంచి పాటలు ఇందులో ప్రధాన బలాలు కాగా.. కథలో కొత్తదనం లేకపోవడం.. సెకండాఫ్ లో కాస్త కామెడీ తగ్గడం, కొన్ని సన్నివేశాలు బోర్ కోట్టించడం, ప్రీ క్లైమాక్స్ లో దమ్ము లేకపోవడం ఈ సినిమాలో బలహీనతలుగా కనిపిస్తున్నాయి. మొత్తం మీద చెప్పాలంటే నాని సినిమాలను బాగా ఇష్టపడే వారికి.. ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతోంది. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -