Friday, May 10, 2024
- Advertisement -

జియో వల్ల వారికి ఎంత లాభమో తెలిస్తే షాకే!

- Advertisement -
jio effect facebook earned 59301 crores

రిల‌య‌న్స్ జియో ఇండియ‌న్ టెలికం రంగంలో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. జియో రావడం వల్ల స్మార్ట్ ఫోన్ ప్రియులే కాకుండా ఫేస్ బుక్ కూడా పండగ చేసుకుంటుంది. జియో ప్రీ నెట్, వాయిస్ కాల్స్ వాడుకుంటూ పండగలా ఎంజాయ్ చేస్తోన్న వినియోగదారులు ప్రీ నెట్ తో కంటిన్యూగా ఫేస్ బుక్ వాడటంతో ఇప్పుడు ఫేస్ బుక్ వారికి భారీగా లాభాలు వచ్చాయట.

బుధవారం ఫేస్‌బుక్ నాలుగో త్రైమాసిక ఫలితాలను తెలిపింది. రూ. 59301 కోట్ల రెవిన్యూ వచ్చిందని ఫేస్‌బుక్ వ‌ర్గాలు తెలిపాయి. జియో దేశ వ్యాప్తంగా ఇచ్చిన ఉచిత ఇంటర్నెట్ ఎఫెక్ట్‌తో జియీ వినియోగదార్య్లు కంటిన్యూగా ఫేస్ బుక్ వాడటంతో ఆదాయం భారీగా పెరిగిపోయింది. వినియోగదారుని బేస్ పరంగా చూస్తే భారతదేశంలో ఫేస్‌బుక్ అగ్ర స్థానంలో ఉంది.

బుధవారం ప్రకటించిన ఫేస్‍బుక్ త్రైమాసిక ఫలితాల్లో రూ.59,301 కోట్లు ఆదాయం రాగా..ఇందులో ఆసియా రీజియన్ నుంచి రూ.9,082 కోట్లు వ‌చ్చిన‌ట్టు ఫేస్‌బుక్ తెలిపింది. జియో ఇచ్చిన ఈ బంపర్ ఆఫర్ ఆసియా- పసిఫిక్ లో ప్రభావం చూపుతోందని.. ఇదొక ప్రత్యేకమైన పరిణామమని ఫేస్ బుక్ అంటుంది. నాలుగో త్రైమాసికం ముగిసేనాటికి భారతదేశంలో ఫేస్‌బుక్ యూజర్లు 16.5 కోట్ల మంది ఉన్నారు. ఇక ప్రపంచలో అమెరికా తర్వాత ఇండియాలోనే ఎక్కువ మంది ఫేస్ బుక్ ని వాడుతున్నారు. 

Related

  1. జియో.. మార్చి ఆఫర్ తర్వాత ఆఫర్ ఇదే!
  2. జియో, ఎయిర్‌టెల్, టెలినార్‌, ఐడియా.. అన్ని ఫ్రీ!
  3. మీకు రిలయన్స్ జియో sim కావాలా ?
  4. జియో – ఎయిర్‌టెల్ వినియోగ‌దారుల లెక్క ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -