Friday, May 17, 2024
- Advertisement -

బాహుబలికి షాక్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌!

- Advertisement -
pawan kalyan Gives Powerful Shock to baahubali

ఇప్పుడు టాలీవుడ్‌ లో భారీ సినిమాలు తెరకెక్కుతున్నాయి. స్టార్ హీరోలకి సంబంధించిన సినిమాలన్ని ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు రాబోతున్నారు. ప్రధానంగా స్టార్ హీరోల భారీ సినిమాలు విడుదల కానున్నాయి. సంక్రాంతికి ఏ విధమైనా పోటీ జరిగిందో అలాగే సమ్మర్ కి సైతం స్టార్ హీరోల సినిమాల మధ్య పోటీ జరగనుందని వీటి విడుదల తేదీలని చూస్తే తెలుస్తోంది. తాజాగా ‘కాటమరాయుడు’చిత్రం తన పంథాని మార్చుకొని బాహుబలికి షాక్ ఇచ్చిందని అంటున్నారు.

పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘కాటమరాయుడు’ చిత్రం షూటింగ్ ఆఖరి దశలో ఉంది. ప్రస్తుతం క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 6 నుండి వైజాగ్లో కొత్త షెడ్యూల్ ప్రారంభించనుంది. అయితే చిత్రీకరణ అనుకున్నదాని కంటే ముందుగానే వేగంగా జరగటంతో ఈ మూవీకి సంబంధించిన రిలీజ్ కాస్త ముందుకు రానుందని అంటున్నారు. మొదట్లో ఈ మూవీ షూటింగ్‌ కాస్త లేటుగా జరగటంతో ఇది ఏప్రిల్ రెండో వారంలో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకున్నారు.

దీని కారణంగా బాహుబలి2కి తెలుగులో కొన్ని థియోటర్స్ తగ్గే అవకాశం ఉంది. కానీ అనూహ్యంగా ‘కాటమరాయుడు’ షూటింగ్ వేగంగా పూర్తి చేసుకొని అనుకున్న డేట్ ప్రకారమే మార్చిలో రిలీజ్ కానుంది. అంతే కాకుండా మార్చి 29న కంటే ఈ మూవీ మరో 10 రోజులు ముందుగా థియోటర్స్ ని హిట్ చేయనుంది.‘కాటమరాయుడు’ షూటింగ్ ఇంత వేగంగా పూర్తి కావటంతో బాహుబలి నిర్మాతలకి కాస్త ఊరట వచ్చింది. ఇక రాజమౌళికి సైతం ఇది కొంత షాకింగ్ గానే ఉందని అంటున్నారు. శరత్ మరార్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డాలి డైరెక్ట్ చేస్తుండగా శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

Related

  1. ఎన్టీఆర్ వర్సెస్ పవన్.. పోటీలో గెలుపు ఎవరిది..?
  2. అన్నయ్యను ఇంటికి వెళ్లిన పవన్.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు!
  3. పవన్ టార్గెట్ ని త్రివిక్రమ్ అందుకుంటాడా..?
  4. అనుకున్నది సాధించిన పవన్ కళ్యాణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -