Sunday, May 12, 2024
- Advertisement -

వీకెండ్ లో అదరగొట్టిన శైలజ

- Advertisement -

కొంతకాలంగా సరైన హిట్ లేక సతమవుతున్న రామ్ కు ఎనర్జిటిక్ హిట్ ఇచ్చింది నేను శైలజ. జనవరి 1న నేను శైలజ అంటూ వచ్చి ప్రేక్షకులను అలరిస్తున్న రామ్ లో దర్శకుడి ప్రతిభను బట్టి సినిమా ఎలాంటి హిట్ అయినా కొట్టొచ్చు అని నిరూపించాడు. కిశోర్ తిరుమల దర్శకత్వం వహించిన నేను శైలజ రామ్, కీర్తి సురేష్ జంటగా నటించారు.

శ్రీ స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిశోర్ నిర్మించిన ఈ సినిమా విదిదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ తో మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక కలక్షన్స్ విషయానికొస్తే ఈ సినిమా రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అనడంలో సందేహం లేదనిపిస్తుంది. ప్రస్తుతం మూడు రోజుల కలక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం – 3 కోట్ల 36 లక్షలు , సీడెడ్ – 1 కోటి 32 లక్షలు , వైజాగ్ – 78 లక్షలు , కృష్ణా – 62 లక్షలు , గుంటూరు – 71 లక్షలు , ఈస్ట్ – 53 లక్షలు, వెస్ట్ – 42 లక్షలు, నెల్లూరు – 31 లక్షలు, కర్ణాటక – 88లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా – 25 లక్షలు, ఓవర్సీస్ – 1 కోటి 57 లక్షల షేర్.. అన్ని ఏరియాలు కలిపి 10 కోట్ల 75 లక్షల షేర్ ని సాధించింది. విడుదలైన మూడు రోజుల కలక్షన్స్ మాత్రమే ఇలా ఉంటే సినిమా ఫుల్ రన్ లో నిర్మాతకు మంచి లాభాలే తెచ్చిపెట్టేట్టు ఉందని చెప్పొచ్చు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -