Sunday, May 19, 2024
- Advertisement -

మహేష్ బావ కి విలన్ గా బావుందట !

- Advertisement -

చాన్నాళ్ళ తరవాత భలే మంచి రోజు తో ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న హిట్ కొట్టిన సుధీర్ బాబు, ఇప్పుడు బాలీవుడ్ తో బిజీ అయిపోయాడు. టైగర్ ష్రాఫ్ హీరోగా నటిస్తున్న ‘బాఘీ’ అనే సినిమాతో విలన్ గా అడుగు పెడుతున్నాడు. ఫిజిక్ తో ష్రాఫ్ కి సమానంగా నిలవడం కష్టం అని చెబుతున్నాడు.

ఏళ్ళకి ఏళ్ళు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్న టైగర్ కి తను పోటీ ఇవ్వలేను అని అందుకే తానూ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు మహేష్ బావమరిది. చాలా సన్నివేశాల్లో టైగర్ కి తన వంతు ప్రయత్నంగా కాంపిటీషన్ ఇవ్వడానికి ప్రయత్నాలు చేసాను అనీ చెబుతున్నాడు సుధీర్.

అనేక విషయాల్లో టైగర్ ష్రాఫ్ కి సమానంగా ఎదురు నిలబడగలిగే నటుడి కోసం.. బాఘీ యూనిట్ సెర్చింగ్ లో తనను ఎంపిక చేసుకున్నట్లు చెప్పాడు. విలన్ రోల్ లో చేస్తున్నందుకు నెగెటివ్ గా ఏమీ ఫీల్ అవడం లేదు అనీ ఇది చాలా పాజిటివ్ ఎనేర్జీ ని ఇచ్చే పాత్ర అనీ చెప్పుకొచ్చాడు సుధీర్. ఒక ఇండస్ట్రీ లో హీరోగా ఉన్న సుధీర్ మరొక ఇండస్ట్రీ లో విలన్ అవడం విశేషమే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -