నార్వేలో విషాదం.. టీకా తీసుకున్న వృద్దులు కన్నుమూత?

- Advertisement -

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ కి ఇప్పుడు వ్యాక్సిన్ వచ్చింది. పలు దేశాల్లో ఇప్పటికే వ్యాక్సిన్ వాడటం కూడా మొదలు పెట్టారు. పలు చోట్ల ఇది మంచి సక్సెస్ అయితే మరికొన్ని చోట్ల వ్యాక్సిన్ తో ఇబ్బందులు పడ్డవారు కూడా ఉన్నారు. నిన్న భారత్ లో పెద్ద ఎత్తున్న టీకా పంపిణీ చేసిన విషయం తెలిసిందే. ఇది స్వయంగా పీఎం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో జరిగింది. తాజాగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం నార్వేలో విషాదాన్ని మిగిల్చింది.

ఫైజర్ తయారు చేసిన వ్యాక్సిన్ ను దేశంలో ఇస్తుండగా, టీకాను తీసుకున్న వారిలో 23 మంది వయో వృద్ధులు తీవ్ర అస్వస్థత బారిన పడి కన్నుమూశారు. ఇంకా పదహారు మంది పరిస్థితి అయోమయంలో ఉంది. అయితే వ్యాక్సిన్ తీసుకుంటే కలిగే స్వల్ప దుష్పరిణామాలే వృద్ధాప్యం కారణంగా వారిలో పెను ప్రభావాన్ని చూపాయని వైద్య నిపుణులు గుర్తించారు. 

- Advertisement -

నార్వేలో 80 ఏళ్లు దాటిన వృద్ధుల జీవితకాలం తక్కువగానే ఉంటుంది కాబట్టి, వారికి టీకా ఇవ్వడాన్ని నిలిపివేయాలని ఆరోగ్య శాఖ అధికారులు సూచించినట్టు ‘బ్లూమ్ బర్గ్’ పేర్కొంది. కాగా, నార్వే ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. వృద్ధుల మరణాలపై ఫైజర్ సంస్థ స్పందిస్తూ, ఈ ఘటనపై విచారణకు పూర్తిగా తమవంతు సహకారాన్ని అందిస్తామని వెల్లడించింది.

Related Articles

Most Popular

- Advertisement -
Loading...

Latest News