తెలుగు ప్రముఖ యాంకర్ రష్మి తెర మీద ఎంత హాట్‌గా కనిపిస్తోందో అంతకన్నా మంచి మనస్సు ఆమె సొంతం. ఎప్పటికప్పుడు తనలోని మంచితనాన్ని బయటికి తీస్తునే ఉంటుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే ….సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది రష్మి. ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం ఓ వీధి కుక్క గురించి తెగ బాధపడిపోయింది. జబ్బుతో బాధపడుతున్న ఆ కుక్కను మెడికల్ ట్రీట్మెంట్ ఇప్పించి ఇంటికి తీసుకుని వెళ్లింది. తాజాగా మరోసారి మూగజీవుల పట్ల తన ప్రేమను చాటుకుంది.
ఈ రోజు హోలీ పండుగ సందర్భంగా మీడియాకు , నెటిజన్లు ఓ విజ్ఞప్తి చేసింది. ప్రతి ఒక్కరికీ నా తరఫున ఒక విన్నపం. కుక్కలపై, ఇతర జంతువులపై రంగులు పూయకండి. ఆ రంగులు వాటి కళ్లలో పడితే అవి చూపు కోల్పోతాయి. రంగులు రాయడం వల్ల అవి ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మనం అయితే శరీరానికి అంటిన రంగులను శుభ్రంగా కడిగేసుకుంటాము , కాని అవి అలా చేయలేవు కదా అంటూ ట్విట్ చేసింది. రష్మి ట్విట్‌కు చాలామంది స్పందిస్తున్నారు. నీది అందమైన శరీరమే అనుకున్నాం , కాని అందమైన మనస్సు కూడా అంటూ అభిమానులు ట్విట్ చేస్తున్నారు.
- Advertisement -
నీది అందమైన శరీరమే అనుకున్నాం కాని…!
- Advertisement -
Related Articles
- Advertisement -
- Advertisement -
Latest News
- Advertisement -