Tuesday, May 14, 2024
- Advertisement -

నేల టికెట్‌లో కొత్త పాప‌

- Advertisement -

సొగ్గాడే చిన్ని నాయ‌న సినిమాతో నాగార్జునకు బంప‌ర్ హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కళ్యాణ్ కృష్ణ కురసాల. ఆ తరువాత నాగార్జున త‌న‌యుడు నాగ చైత‌న్య‌కు రారండోయ్ వేడుక చూద్దాంతో మ‌రో హిట్ ఇచ్చాడు. ఈ రెండు సినిమాలు అన్న‌పూర్ణ స్టూడియోస్ బ్యాన‌ర్‌లో నిర్మాణ‌మ‌య్యాయి. పైగా అక్కినేని కుటుంబంతోనే రెండు సినిమాలు తీశాడు. మూడో కూడా ఆ కుటుంబంతోనే అనుకున్నారు. కానీ త‌ర్వాత మాస్ మ‌హారాజా రవితేజతో క‌లిసిపోయాడు. ర‌వితేజ‌తో ‘నేల టిక్కెట్’ అనే సినిమాను తీస్తున్నాడు. టైటిల్‌నే విభిన్నంగా ఎంచుకున్నాడు. ఇక క‌థ‌, సినిమా కూడా విభిన్నంగా ఉండ‌నుంద‌ని టాక్‌.

అయితే ఈ సినిమాతో ఓ కొత్త పాప‌ను తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌యం చేయాల‌ని చిత్ర‌బృందం ప‌రిశీలిస్తోంది. మోడలింగ్ రంగం నుంచి వచ్చిన మాళవిక శర్మ అనే హాట్ మోడల్‌ను ప‌రిచ‌యం చేస్తార‌ట‌. వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించిన మాళ‌విక సినిమాలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ర‌వితేజ‌తో న‌టించే అవ‌కాశం కొట్టేసిన‌ట్టే. కెవిన్ కేర్, సెవ‌న‌ప్ – హిమాలయా వంటి బ్రాండ్ల యాడ్స్‌కు మాళ‌విక పనిచేసింది. ఇప్పుడు రవితేజ సినిమాతో నటిగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది అంటున్నారు. ప్ర‌స్తుతం రవితేజ టచ్ చేసి చూడు సినిమా షూటింగ్ పూర్తయి విడుద‌లకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా త‌ర్వాత క‌ల్యాణ్ కృష్ణ‌తో చేయ‌నున్నాడ‌ని సమాచారం.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -