Thursday, May 23, 2024
- Advertisement -

కొత్త జెమ్స్‌బాండ్ వ‌చ్చేశాడోచ్‌

- Advertisement -

స్పై థ్రిల్ల‌ర్స్ ఎన్ని వ‌చ్చినా.. జేమ్స్‌బాండ్ మూవీస్‌లో ఉండే కిక్కే వేరు. ఒక‌టి కాదు రెండు కాదుయాభై ఏళ్లుగా బాండ్ సిరీస్ మూవీస్ ప్రేక్ష‌కుల‌ను అలరిస్తూనే ఉన్నాయి. ఇప్పటి వరకు 24 సినిమాలు రాగా… పలువురు స్టార్స్ యాక్ట‌ర్స్‌ జేమ్స్ బాండ్ పాత్రలో ప‌రకాయ ప్ర‌వేశం చేసి మెప్పించారు.

ప్రస్తుతం 25వ బాండ్ మూవీ డేనియల్ క్రేగ్ హీరోగా రూపొందుతోంది. బాండ్ సిరీస్‌లో గత నాలుగు సినిమాల్లో డేనియల్ క్రేగ్ నటించాడు. ప్రస్తుతం అతడు తన 5వ బాండ్ మూవీ చేస్తున్నాడు. అయితే ఇదే నా చివ‌రి బాండ్ మూవీ అని క్రేగ్ క్లారిటీ ఇచ్చేశాడు. మ‌రి త‌రువాత 007 ఎవ‌రు అన్న ప్ర‌శ్న ప్రారంభ‌మైంది బాండ్ మూవీ ఫ్యాన్స్‌కు.

ఈ నేపథ్యంలో కొత్త జేమ్స్ బాండ్ హీరోను ప్రపంచానికి పరిచయం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రేజీ రిచ్ ఏషియన్’ మూవీ స్టార్ హెన్రీ గోల్డింగ్ నెక్ట్స్ జేమ్స్ బాండ్ హీరోగా ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తలపై హెన్రీ గోల్డింగ్ సైలెన్స్ మెయింటేన్ చేస్తున్నాడు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.

ఇదిలా ఉంటే నెక్ట్స్ జేమ్స్ బాండ్ మూవీ ఏప్రిల్ 8, 2020న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. దర్శకుడు డానీ బోయెల్ తప్పుకోవడంతో దర్శకత్వ బాధ్యతలు జోజి ఫుకునాగ చేపట్టారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -