Monday, May 6, 2024
- Advertisement -

రెజీనా వేల్ స్టంట్‌కు నెటిజ‌న్లు ఫిదా ..

- Advertisement -

ఏ నేష‌న‌ల్ జియోగ్ర‌ఫినో లేక‌.. బీబీసీ ఎర్త్‌లోనే తిమింగ‌ళాలను చూసి సంబ‌ర‌ప‌డుతుంటాం. కానీ నిజంగా అవి మ‌న ద‌గ్గ‌రికి వ‌స్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. అవి మ‌న‌కు సుర‌క్షిత‌మైన దూరంలో ఉన్న‌ప్పుడు ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఉంటుంది. అదే మ‌నం నీటిలో ఉండి.. ఓ కిల్ల‌ర్ వేల్ మ‌న ద‌గ్గ‌ర‌కు దూసుకువ‌స్తుంటే ప‌రిస్థితి ఏంటీ? ఊహించ‌డానికే భ‌యంక‌రంగా ఉంది క‌దూ.

అంటార్కిటిక్ సముద్ర జలాలు.. న్యూజీలాండ్ తీర ప్రాంతాల్లో భయంకరమైన వేల్స్ సంచ‌రిస్తుంటాయి. కానీ ఎలాంటి భ‌యం లేకుండా మెరైన్ సైంటిస్ట్ రెజీనా ఈసర్ట్ అందులోకి వెళ్లింది. అప్పుడో వేల్ త‌న మీద‌కు దూసుకొచ్చింది. కానీ ఆమె అలానే నిల్చొని ఉండిపోయింది. వేల్ ఏమి చేయ‌లేద‌నుకోండి. కానీ ఆ స‌మ‌యంలో కెమెరా ఆన్ చేసి ఉండ‌టంతో మంచి ఫుటేజీ మాత్రం దొరికింది. కిల్లర్ వేల్ ఒకటి.. త‌న‌ మొహం దగ్గరగా వచ్చి చూసిమరీ వెళ్ళింది. ఆ వేల్‌ టూత్‌ఫిష్‌ నమిలి తింటూ.. తనకు ఆఫర్ చేసినట్లు అనిపించింది.. కాస్త థ్రిల్.. ఇంకాస్త ఫియర్.. అయినా ఇదొక అరుదైన అనుభూతి.. అంటూ ఫుల్ ఎక్సైట్ అయిపోయింది రెజీనా.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -