- Advertisement -

బాజాపా సీనియ‌ర్ నేత బ‌ద్దం బాల్ రెడ్డి క‌న్నుమూత‌…

- Advertisement -

సీనియర్ బీజేపీ నేత బద్దం బాల్ రెడ్డి కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్న ఆయ‌న కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూసాయంత్రం తుదిశ్వాస విడిచారు. కార్వాన్‌ నియోజకవర్గం నుంచి మూడుసార్లు బద్దం బాల్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. పాతబస్తీ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన బద్దం బాల్‌రెడ్డిని అభిమానులు గోల్కొండ టైగర్‌గా పిలుచుకొనేవారు. 1985, 1989, 1994లో కార్వాన్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. గత ఎన్నికల్లో కూడా ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బద్దం బాల్ ‌రెడ్డి మృతి వార్తతో బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నేతలు కిషన్‌ రెడ్డి, లక్ష్మణ్‌ తదితరులు కేర్ ఆస్పత్రికి చేరుకున్నారు. బద్దం బాల్ రెడ్డి భౌతికకాయానికి నివాళి అర్పించారు. ఆయన మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం శ్మశానవాటికలో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -