Monday, April 29, 2024
- Advertisement -

మొన్న క‌న్ను కొట్టింది.. నేడు ముద్దు పెట్టేసింది..

- Advertisement -

ఇటీవ‌ల ఒక అమ్మాయి కన్నుగీటి అంద‌ర్నీ ఫిదా చేసేసింది. ఎంతోమంది ఆమె క‌న్ను కొడితే ప‌డిపోయారు. యువత అయితే ప్యార్‌మే ప‌డిపోయా అంటూ పాట‌లు వేసుకుంటున్నారు. ఎంతో ముద్దుగా చూడ‌ముచ్చ‌ట‌గా ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు ప్రేమికుల రోజు సంద‌ర్భంగా ముద్దు పెట్టేసింది. ఆమె కనుసైగల కదలికలతో ముచ్చ‌ట ప‌డిన వారికి ఇప్పుడు ముద్దుతో మ‌రో లోకంలో తేలుతున్నారు. ఆమె హావభావాలు చూసి ప్రేమమైకంలో మునిగిపోయింది.

అయితే ఇప్పుడు వాలెంటైన్స్‌ డే (ఫిబ్ర‌వ‌రి 14) సంద‌ర్భంగా 40 సెకన్ల నిడివిని విడుద‌ల చేశారు. ఆ అమ్మ‌డే ప్రియా ప్రకాశ్‌ వారియర్‌. ఓవర్‌నైట్‌ సెన్సేషనల్‌ స్టార్‌ అయిన ఈ పదెనిమిదేళ్ల అమ్మాయి గురించి సూపర్‌ స్టార్లు మొదలు టీనేజ్‌ అబ్బాయిల వరకు ప్రతి ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రేమికుల రోజు కానుకగా ఒక తూటాలాంటి ముద్దుతో యువకుడి గుండెను ప్రేమతో పేల్చేసిన ఆమె మరో వీడియోను విడుద‌ల చేశారు.

‘ఒరు ఆదార్‌ లవ్‌’ అనే మలయాళ సినిమాలో ప్రియాప్రకాశ్‌ వారియర్ న‌టిస్తోంది. ఈ సినిమాలో కనుసైగలతో, కన్నుగీటుతూ యువకుడిని ప్రేమమైకంలో ముంచెత్తే ప్రియాప్రకాశ్‌ సెన్సేషనల్ అయ్యింది. ప్రియ.. ఒక ముద్దు పెట్టి దాన్ని గన్‌లా మార్చి బుల్లెట్‌లా వ‌దిలితే.. అది తగిలి ఓ యువ‌కుడు తేలిపోతాడు. ఈ వీడియో ఎంతో ముచ్చ‌ట‌గా ఉంది. నిజానికి ఆమె విసిరిన ఫ్ల‌యింగ్‌ కిస్‌కు అబ్బాయిలు గుండెలు పేలిపోయాయని నెటిజన్లు ఈ వీడియోపై కామెంట్‌ చేస్తున్నారు.

https://www.youtube.com/watch?v=0UR_1BPSwII

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -